రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పడం కష్టం.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెత కొంతమందిని చూస్తే అర్థమవుతుంది.. మొన్నటి వరకు బీఆర్ఎస్ అంటే ప్రాణంగా భావిస్తూ కేసీఆర్, కేటీఆర్ లను ఎంతో పొగిడిన నేతలే వాళ్ళని విమర్శిస్తూ పార్టీలు మారుతూ వస్తున్నారు.. తాజాగా అదే కోవలో అచ్చంపేట స్థానం నుంచి గతంలో  ఎమ్మెల్యేగా గెలుపొందిన గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఈయన కేసీఆర్, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. వాళ్ల ఫామ్ హౌస్ ఎపిసోడ్ గురించి గువ్వల బాలరాజ్ కు మాత్రమే పూర్తిగా తెలుసు. అలాంటి గువ్వల బాలరాజ్ తాజాగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరారు. 

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఎప్పుడైతే బీజేపీలో చేరారో అప్పుడే ఆయన కొన్ని సంచలన  విషయాలను బయట పెట్టారు. అయితే కల్వకుంట్ల తారకరామారావు తనను బచ్చాగాడు అని వ్యాఖ్యానించడంపై గువ్వల బాలరాజ్ కాస్త సీరియస్ అయ్యాడు.. నేను ఆకలి కేకల గురించి వినిపించడం మొదలుపెడితే మాత్రం కేటీఆర్ గ్రామాల్లో అసలు తిరగలేడు అంటూ చెప్పుకొచ్చారు.. నాకంటే కేటీఆర్ పెద్దోడేమీ కాదు. ఆయన ఎదిగిన సామాజిక వర్గం నుంచి వచ్చి, అమెరికాలో చదువుకున్నాడు, నైపుణ్యాలు నేర్చుకొని నాకంటే ఎక్కువగా ఆకట్టుకునేలా మాట్లాడుతాడు.

కానీ నేను పేద వర్గం నుంచి వచ్చాను ఆకలికేకలు చూసిన వ్యక్తిని, నాకు ఉన్నంత అనుభవం ఆయనకు లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మొదటిసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు కేవలం 300 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందాడు. దీన్ని బట్టి చూస్తే నా ముందు కేటీఆరే బచ్చాగాడు అంటూ విమర్శించాడు. అంతేకాదు కేసీఆర్ ను ఉద్దేశించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రెండుసార్లు సీఎం అవ్వడానికి కారణం నేను.. మేము వేసిన బిచ్చంతోనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు అంటూ విమర్శించారు. మరి గువ్వల బాలరాజ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: