
తామరస్సేరీ చెందిన 9 ఏళ్ల బాలిక ఈ వైరస్ వల్ల మరణించినట్లుగా అక్కడ కేరళ వైద్యులు ధ్రువీకరించారు. ముఖ్యంగా ఆ బాలికకు ఈనెల 13వ తేదీ నుంచి తీవ్రమైన జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లి మరి చూపించారట. ఎంత చూపించినా కూడా ఈ బాలికకు జ్వరం తగ్గకపోవడంతో పాటుగా తీవ్రమైన తలనొప్పి జ్వరం రావడంతో కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించినప్పటికీ ఆ బాలిక పరిస్థితి పూర్తిగా విషమించి కన్ను మూసింది. అయితే వైద్యులు పరీక్షలు నిర్వహించగా అమీబిక్ ఎన్కెఫలిటీస్ అనే వ్యాధితో మరణించినట్లుగా వైద్యులు గుర్తించారు.
ఈ ఏడాది అదే జిల్లాలో ఈ వ్యాధికి సంబంధించి మరో నలుగురికి కూడా ఇవే కేసులు నమోదయాయని తెలియజేశారు. అయితే ఇది కలుషితమైన నీటిని తాగడం వల్ల సోకే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. దీంతో ఆ జిల్లాలోని వాసులే కాకుండా కేరళ రాష్ట్రంలోని ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. వైద్యులు మాత్రం ఈ వ్యాధి గురించి కీలక విషయాలు తెలియజేశారు.. ముఖ్యంగా ఈ వైరస్ మనం తాగేటువంటి నీటి ద్వారానే మన మెదడుకు చేరుతుందని అంతేకాకుండా మెదడులో పునరావృత్తి చేసుకుంటూనే మెదడులో ఉండే భాగాలను కూడా దెబ్బతీసేలా చేస్తుందని తెలిపారు.
దీనివల్లే ఈ వ్యాధి బారిన పడ్డవారికి తీవ్రమైన తలనొప్పి, మతిమరుపు ,జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని దీనివల్ల చివరికి మరణం సంభవిస్తుందని తెలియజేశారు. అందుకే వైద్యుల సైతం ప్రతి ఒక్కరు గోరువెచ్చని నీటిని తాగడం మంచిదని తెలుపుతున్నారు.