ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  నేతల మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం చెలరేగూతూనే ఉంటుంది.. అయితే వివాదం అనేది అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య జరగాలి కానీ వైసిపి పార్టీలోనే నేతల మధ్య విభేదాలు ఏర్పడి దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఒక వైసీపీ నేతపై ఒక బడా లీడర్ అనుచరులు దాడి చేసి చావబాదారు.. మరి ఆ నేత ఎవరో ఆ వివరాలు చూద్దాం.. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట వైసీపీలో విభేదాలు బయటకు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా పాలెంకు చెందిన వైసిపి నాయకుడు వెంకటేశ్వర్ రెడ్డిపై విపరీతంగా దాడి చేశారు.జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు దాడి చేశారని వెంకటేశ్వర్ రెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు.

 ఆయనపై reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి  అనుచరులు 20 మంది యువకులు వచ్చి మారణాయుధాలతో విపరీతంగా కొట్టారని, నేను కింద పడిపోయి చనిపోయాను అనుకోని వారు వెళ్ళిపోయారని అన్నారు. ఆ తర్వాత నా భార్య బిడ్డలు కలిసి నన్ను నరసారావు పేట ప్రభుత్వ  ఆసుపత్రిలో చేర్చారని ప్రస్తుతం నేను చికిత్స తీసుకొని ప్రాణాలతో బయటపడ్డాను అని తెలియజేశారు. జగనన్న అధికారంలో ఉన్న సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని అలాగే ఇల్లు కట్టిస్తామని చెప్పి  పేదలకు సంబంధించిన భూమి లాక్కున్నారని అన్నారు.

రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను కూడా తీసుకున్నారని మొత్తం మూడు కోట్లకు పైగా అవినీతి చేశారని తెలియజేశారు. ఆయన చేసిన అక్రమాలను నేను బయట పెట్టినందుకు నాపై దాడి చేయించారని అన్నారు. ఈ దాడి విషయంలో నరసరావుపేట పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశానని అయినా పోలీసులు ఇప్పటికి ఎవరిని అరెస్టు చేయలేదని అన్నారు. నాకు reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి  శ్రీనివాస్ రెడ్డితో ప్రాణభయం ఉందని, ఆయన చేసిన అక్రమాలన్నీ బయటపెడతానని, అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కోరారు. ప్రస్తుతం ఈ దాడి మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: