
తిరోగమనంలో అమ్మకం పన్ను.. క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తికి ఇదే నిదర్శనం అంటూ వైసిపి అనుకూల మీడియా రాసుకు వచ్చింది. 2023 -24 తో పోలిస్తే రెవెన్యూ రాబడులు 9400 కోట్ల రూపాయలు లాస్ అన్నట్లుగా తెలుపుతున్నారు. అలాగే కేంద్రంలో టిడిపి భాగస్వామిగా ఉన్న గ్రాంట్లో ఏకంగా15,581 కోట్ల రూపాయలు తగ్గుదల ఉందని..గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. సామాజిక రంగవేయం 8,863 కోట రూపాయల తక్కువ అంటూ తెలుపుతున్నారు. చంద్రబాబు పాలనలో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరగడమే.. కానీ తగ్గుదల మాట లేదంటు వైసిపి అనుకూల మీడియా హైలెట్ చేశారు.
కానీ టిడిపి అనుకూల మీడియా మాత్రం చంద్రబాబు పాలన అద్భుతంగా కొనసాగుతోందని పెట్టుబడులు భారీగానే రాబడుతున్నాయంటూ రాసుకున్నారు.. దీన్ని బట్టి చూస్తే ప్రజలు కూడా వాటినే నమ్మే పరిస్థితిలో ఉన్నారనే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే కాలంలో సూపర్ సిక్స్ హామీలకు భారీగానే ఖర్చు చేస్తున్నారని దీనివల్ల భారీగానే అప్పులు చేస్తున్నారనే విధంగా కూటమి ప్రభుత్వం వినిపిస్తోంది. సంపాద సృష్టించి ఇస్తానన్న చంద్రబాబు కేవలం అప్పులతోనే అన్నిటిని కాలయాపన చేస్తున్నారంటూ పలువురు వైసిపి నేతలు కూడా తెలియజేస్తున్నారు. మరి ఇప్పటికే అమరావతి రాజధాని, పోలవరం పనులను మరికొన్ని పనులను కూడా ఈ ఏడాదిలోపు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.