మనకు తెలిసిందే, వార్ 2 సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఒక డిజాస్టర్‌గా మారిపోయింది. అయితే ఇది టాలీవుడ్‌కే వర్తిస్తుంది. బాలీవుడ్‌లో మాత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి మంచి కలెక్షన్స్ రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్ నటన, పెర్ఫార్మెన్స్, డైలాగ్ చెప్పే విధానానికి అందరూ ఫిదా అయ్యారు. అయితే వార్ 2 సినిమా తెలుగులో ఎందుకు డిజాస్టర్ అయిందని ఫ్యాన్స్ ఆరా తీస్తున్న సమయంలో, టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు సంబంధించిన ఒక ఆడియో లీక్ అయ్యింది. ఆ ఆడియోలో ఆయన జూనియర్ ఎన్టీఆర్‌ను బూతులు తిడుతున్నట్లు క్లియర్‌గా వినిపిస్తోంది. దీనిపై ఆయన స్పందిస్తూ – “ఇది నా వాయిస్ కాదు, ఎవరో మోసం చేశారు” అని చెప్పుకొచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అది నమ్మడం లేదు. ఆయనపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. పలుచోట్ల నిరసనలు కూడా చేశారు.


ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అసలు స్పందించలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరూ పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ఒక సింగర్ , రోజా మాత్రమే మాట్లాడింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొన్ని విషయాలను బయటపెట్టినట్లు సమాచారం. ఈ ఇష్యూ గురించి జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో  జనాలు మండి పడుతున్నారు.  “ఇతరులకు పర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వం, జూనియర్ ఎన్టీఆర్‌కు ఎందుకు ఇవ్వడం లేదు? వార్ 2 ఫ్లాప్ కావడం వెనక టిడిపి కుట్ర ఏదైనా ఉందా?” అని జనాలు మండిపడుతున్నారు. అంతేకాక, పలుచోట్ల ఫ్యాన్స్‌ను కూడా భయపెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆడియో లీక్ చేసిన వ్యక్తికి ప్రాణహాని ఉందంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు.



అంతేకాదు “దగ్గుబాటి ప్రసాద్ అది తన వాయిస్ కాదని చెబుతున్నారా? అయితే ఆ ఆడియోని ఫోరెన్సిక్‌కు పంపండి. స్పెషల్ టీం రెడీ చేసి ఎంక్వైరీ చేయించండి. అప్పుడు నిజానిజాలు బయటపడతాయి” అని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ పని దగ్గుబాటి ప్రసాద్ చేయలేదని, దీని వెనక టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు రాజకీయాలలో పాపులారిటీ సంపాదించుకున్న ఒక పెద్ద మనిషి ఉన్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి ఆయనకే జూనియర్ ఎన్టీఆర్‌పై పిచ్చి కోపం ఉండేది. అదే కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని కూడా జనాలు భావిస్తున్నారు. మొత్తానికి, జూనియర్ ఎన్టీఆర్‌ను తొక్కేయడానికి టిడిపి ప్లాన్ చేస్తోందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం వల్ల ఇంకా డౌట్లు పెరుగుతున్నాయి. ఈ వివాదం సర్దుమణగాలంటే టిడిపి నుంచి ప్రముఖులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ తరఫున ఒక పెద్ద వ్యక్తి కానీ స్పందించాల్సిందే..!?

మరింత సమాచారం తెలుసుకోండి: