
ఒకవైపు ఆరోపణలు చేస్తూనే, మరోవైపు పాకిస్తాన్ నాయకులు మాట్లాడే తీరు మాత్రం మృదువుగా మారింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ “కాశ్మీర్‌తో సహా అన్ని అంశాలపై భారత్‌తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం” అని ప్రకటించారు. ఉగ్రవాదం నుంచి వాణిజ్యం వరకు అన్ని రంగాల్లో సహకారం కావాలని కోరారు. కానీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది పాక్ ప్రజలకు, అంతర్జాతీయ సమాజానికి ఒక “మంచి ముఖం” చూపించడానికే చేసిన ప్రయత్నం. భారత్ వైఖరి మాత్రం చాలా క్లియర్‌గా ఉంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు – “ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఎలాంటి చర్చలు జరగవు. చర్చలు జరగాలంటే ముందుగా ఉగ్రవాదం ఆగాలి” అని. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) సమస్య పరిష్కారం కాకుండా ఎలాంటి పురోగతి జరగదని భారత్ పదేపదే చెబుతోంది.
పాకిస్తాన్ తరచుగా క్రీడలు, సంస్కృతి, రాజకీయాలను కలపవద్దని చెబుతూ ఉంటుంది. కానీ ప్రాక్టికల్‌గా మాత్రం అదే చేస్తుంది. తాజాగా షాంఘై సహకార సంస్థ (SCO) మీటింగ్‌లో భారత్ - పాక్ నేతల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక చర్చ జరగదని భారత్ స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్‌పై అంతర్జాతీయ వేదికలలో ఒత్తిడి మరింత పెరిగింది. అగ్ని-5 విజయవంతమైన పరీక్షతో భారత్ మరోసారి తన శక్తిని ప్రదర్శించింది. పాకిస్తాన్ అయితే ఒకవైపు ఆరోపణలు చేస్తూనే, మరోవైపు చర్చలు కోరుకోవడం తమ దేశ ప్రజలకు మోసం చేయడమే అని స్పష్టమవుతోంది. భారత్ దౌత్యపరంగా, సైనికపరంగా బలంగా నిలబడుతుండగా, పాక్ మాత్రం భయంతో రాజకీయ మాయగాళ్ల ఆట ఆడుతోంది.