గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లోని టిడిపి ఎమ్మెల్యేల వైఖరి అటు నేతలను, కార్యకర్తలను కొంత ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే కొంతమంది నేతలపైన సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో కూడా అసంతృప్తిని తెలియజేశారు. ప్రధానంగా టిడిపి, జనసేన ఎమ్మెల్యేలు పనితీరు కొన్నిసార్లు విమర్శలకు గురయ్యేలా చేస్తోంది. అలా సుమారుగా ఇప్పటివరకు అయితే 25 మంది పైగా ఎమ్మెల్యేల తీరు మీద అలాగే వాళ్ల మీద వచ్చిన వివాదాలకు సంబంధించి సీఎం చంద్రబాబు కూడా అసంతృప్తితో ఉన్నట్లు వినిపిస్తున్నాయి.



ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కు సంబంధించిన విషయాలను యాక్షన్ మొదలయ్యింది. అలాగే అక్కడ నియోజకవర్గాలలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో కూడా ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొన్న జరిగిన టిడిపి విస్తృతస్థాయి సమావేశాలలో ఎమ్మెల్యేలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ సీఎం చంద్రబాబు కూడా హెచ్చరించారు. ఒకటి రెండు సార్లకు మించి ఇక  చెప్పనని ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయంటూ హెచ్చరించారు.



మరి సీఎం చంద్రబాబు చెప్పినటువంటి వ్యాఖ్యాలలో ఆ రకమైన వాతావరణ ఉంటుందా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవడం అంటే కచ్చితంగా ఆ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పవర్ కట్ చేయడమే అన్నట్లుగా వినిపిస్తోంది. అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందించకపోవడం, కొత్త ఇన్చార్జిలను నిర్మించడం, కేవలం ఎమ్మెల్యే పాత్ర నామమాత్రంగా ఉండేలా చేయాలి..ఇవన్నీ చేస్తేనే ఎమ్మెల్యేల పైన తీవ్రస్థాయిలో చర్చలు తీసుకున్నట్లుగా అనిపిస్తోందని కొంతమంది రాజకీయ నిపుణులు తెలుపుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలు రిపీట్ గా తప్పులు చేస్తే సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారుతున్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: