అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్య చేస్తున్న కొన్ని ప్రకటనల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా షేర్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈయన అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చాక భారత దేశం పై కూడా అనేక టారీఫ్ లను విధించాడు. దానితో భారత స్టాక్ మార్కెట్లు కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇకపోతే ప్రపంచంలో అత్యంత బలమైన సంపన్న దేశాలలో అమెరికాతో పాటు చైనా కూడా పోటీ పడుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య కూడా అంత గొప్ప సఖ్యత ఏమీ లేదు.

తాజాగా ట్రంప్ అమెరికాను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. తాజాగా ట్రంప్ చైనా ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ... బీజింగ్ తో మేము అత్యంత గొప్ప సంబంధాలను కొనసాగించాలి అని అనుకుంటున్నాము. కానీ చైనా కంటే మా ఆధిపత్యమే ఎక్కువ అని ఆయన వ్యాఖ్యానించాడు. ఒక వేళ ఆ విషయంలో మాతో పోటీకి వస్తే బీజింగ్ కి వినాశనం తప్పదు అని ట్రంప్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ట్రంప్ ఇదే సమావేశంలో మాట్లాడుతూ ... ఈ సంవత్సరం చివరన లేదా వచ్చే సంవత్సరంలో నేను చైనా పర్యటనకు వెళ్తాను.

మా రెండు దేశాల మధ్య అద్భుతమైన సంబంధాలు ఉండబోతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య విభేదాల్లో  బీజింగ్ తో పోలిస్తే వాషింగ్టన్ అత్యంత బలంగా ఉంది. చైనా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. వాటితో ఆట రసవత్తనంగా ఉంటుంది. కానీ మా దగ్గర కూడా కొన్ని కార్డ్స్ ఉన్నాయి. వాటితో నేను గేమ్ అస్సలు ఆడాలి అనుకోవట్లేదు. ఒక వేళ నా దగ్గర ఉన్న కార్డ్స్ తో నేను గనుక గేమ్ ఆడినట్లయితే చైనా  నాశనం అవుతుంది. అందుకే నేను నా దగ్గర ఉన్న కార్డ్స్ తో ప్రస్తుతానికి గేమ్ ఆడాలి అనుకోవట్లేదు అని ట్రంప్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: