ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అద్భుతమైన అసెంబ్లీ స్థానాలలో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అధికారం లోకి వచ్చింది. దానితో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి అయ్యాక కొత్త పథకాలను కొన్నింటిని స్టార్ట్ చేసి అద్భుతంగా వాటిని ముందుకు తీసుకు వెళ్ళాడు. కానీ ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో కానీ 2019 ఎన్నికల్లో మాత్రం తెలుగు దేశం పార్టీ కి ఘోర పరాజయం దక్కింది.

2019 వ సంవత్సరం వై సీ పీ పార్టీ అద్భుతమైన స్థాయిలో స్థానాలను దక్కించుకొని అధికారం లోకి వచ్చింది. ఇక వై సి పి పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. 2019 వ సంవత్సరం ఈయన నవ రత్నాలు పేరుతో కొన్ని పథకాలను తీసుకు వచ్చారు. అందులో భాగంగా పెన్షన్లను 1 వ తేదీనే ఇచ్చారు. ఉద్యోగులకు జీతాలు 1 వ తేదీన ఇవ్వకపోయినా పెన్షన్ లను మాత్రం 1 వ తేదీన ఇచ్చాడు. అలాగే మరికొన్ని పథకాలను కూడా అద్భుతంగా ముందుకు తీసుకు వెళ్లాడు. ఇక 2024 ఎన్నికల్లో వై సి పి పార్టీ కి ఘోర పరాజయం దక్కింది.  

ఈ 2024 ఎన్నికల్లో తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. ఈ కూటమి కి అద్భుతమైన విజయం దక్కింది. ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు , జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. మీరు ఇచ్చిన పథకాల కంటే మేము ఇచ్చిన పథకాలు అద్భుతంగా ముందుకు సాగుతున్నాయి. కావాలంటే మనిద్దరం దాని గురించి డిస్కస్ చేద్దాం. అసెంబ్లీ కి నువ్వు రా అని ఛాలెంజ్ విసారాడు. దానితో ఈ సారి అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా  మారనున్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: