
-
Ajit Pawar
-
Akhilesh Yadav
-
Bharatiya Janata Party
-
central government
-
CM
-
Congress
-
Gharshana
-
harikrishnana
-
kavitha
-
KCR
-
Laloo Prasad Yadav
-
Loksabha
-
M. Karunanidhi
-
Maharashtra
-
Maharashtra Navnirman Sena
-
Maneka Gandhi
-
Nijam
-
NTR
-
Party
-
Prime Minister
-
raj
-
Sardar Vallabhai Patel
-
Success
-
Tammudu
-
Thammudu
-
Uddhav Thackeray
-
war
-
Wife
మహారాష్ట్ర – పవార్ కుటుంబ పోరు :
శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో ఆయన మేనల్లుడు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి పార్టీనే చీల్చారు. 2023లో షిండే శివసేన-బీజేపీ కూటమికి జతకట్టి ఉపముఖ్యమంత్రిగా సీటు కైవసం చేసుకున్నారు. 2024లో కూటమిగా పోటీ చేసి అధికారాన్ని కూడా గెలుచుకున్నారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద కుటుంబ తిరుగుబాటు.
తమిళనాడు – కరుణానిధి వారసత్వం కోసం పోరు :
డీఎంకేలో కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి వ్యతిరేక కార్యకలాపాల కారణంగా బహిష్కరించబడ్డాడు. చివరికి ఆయన తమ్ముడు స్టాలిన్ పార్టీని నడిపి సీఎం అయ్యాడు. కుటుంబంలోనే చోటుచేసుకున్న ఈ పోరు తమిళనాడులో పెద్ద చర్చ అయ్యింది.
ఉత్తర్‌ప్రదేశ్ – అప్నాదళ్ లోనూ కలహాలు :
అప్నాదళ్ వ్యవస్థాపకుడు సోన్ లాల్ పటేల్ తన కుమార్తె అనుప్రియా పటేల్ను సస్పెండ్ చేశారు. కానీ ఆమె ఆగకుండా బీజేపీలో చేరి ప్రస్తుతం కేంద్ర సహాయమంత్రిగా ఎదిగింది.
ఇందిరా – మేనకా ఘర్షణ :
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బహిష్కరించబడ్డారు. తర్వాత జనతాదళ్‌లో చేరి, ఇప్పుడు బీజేపీ సీనియర్ నేతగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ – ఎన్టీఆర్ కుటుంబ కలహాలు :
టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ పార్టీ వ్యతిరేక ధోరణి కారణంగా సస్పెండ్ అయ్యారు. తర్వాత ఆయన స్వంతంగా పార్టీ పెట్టినా సక్సెస్ కాలేక, చివరికి తిరిగి టీడీపీలో విలీనం చేశారు.
మహారాష్ట్ర – శివసేనలో ఠాక్రేల యుద్ధం :
బాలఠాక్రే మేనల్లుడు రాజ్ ఠాక్రే వారసత్వ వివాదం కారణంగా పార్టీ నుంచి బయటకు వెళ్లి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ప్రారంభించారు. నేడు రాజ్ – ఉద్ధవ్ మళ్లీ దగ్గర కావడం అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామం.
ఉత్తర్‌ప్రదేశ్ – సమాజ్‌వాదీ కుటుంబ డ్రామా :
ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్ యాదవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ పార్టీని నడుపుతున్నారు. ఆయన భార్య డింపుల్ యాదవ్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.
బిహార్ – లాలూ కుటుంబం విభేదాలు :
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీకి నష్టం కలిగించే చర్యల కారణంగా బహిష్కరించారు. ఇది కూడా బిహార్ రాజకీయాల్లో సంచలనమే.
తెలంగాణ – కవిత ఎపిసోడ్ :
ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవితపై బీఆర్‌ఎస్ పార్టీ సస్పెన్షన్ వేయడం కొత్త ఎపిసోడ్. పార్టీ నేతలపై ఆరోపణలు, వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని కారణం చూపి ఈ చర్య తీసుకున్నారు.
మొత్తం మీద: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుటుంబ కలహాలు, వారసత్వ వివాదాలు, పార్టీ లోపలి ఘర్షణలు రాజకీయాల్ని కుదిపేశాయి. ఈ క్రమంలో “రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు” అన్న నిజం మళ్లీ మళ్లీ నిరూపితమవుతోంది.