తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించింది బిఆర్ఎస్ పార్టీ. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేపట్టింది.గత ఎన్నికలలో ఓడిపోయింది.అప్పటి నుంచి బిఆర్ఎస్ పార్టీలో చీలికలు మొదలయ్యాయి. బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత ఇష్యూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే కవిత ప్రవర్తిస్తున్నదనే ఆరోపణలతో బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో కూడా మాట్లాడుతూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తాను ఎమ్మెల్సీ పదవి,పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లుగా ప్రకటించింది. దీంతో కవిత రేపో మాపో ఒక కొత్త పార్టీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది.

ఇలాంటి సమయంలోనే కేసీఆర్ అప్పుడు చేసింది కవిత ఇప్పుడు చేస్తోంది. ఆనాడు కెసిఆర్ కూడా టిడిపి సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేపు మాపో కొత్త పార్టీ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మాకు పదవులు ముఖ్యం కాదని అప్పుడు కేసీఆర్ చేసింది.. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడుస్తోంది.


 ఆనాడు కెసిఆర్ కూడా పార్టీ ఏర్పాటు చేసి ఉద్యమంలోకి వెళ్ళగా ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడవబోతోంది. ఉద్యమం నుంచి వచ్చిన మాకు మళ్లీ  ఉద్యమంలోకి వెళ్లడం కొత్తేమీ కాదంటూ తెలియజేసింది. కెసిఆర్ పార్టీ పెట్టిన తర్వాత స్థానిక ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కవిత పార్టీ పెట్టిన తర్వాత కూడా ఎన్నికలు జరుగుతాయని.. వీటిలో జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో కవిత నిలబడే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం అయితే ఇప్పుడు జరుగుతోంది. అప్పట్లో కెసిఆర్ కి ఉప ఎన్నికలు కలిసి రాగ ఇప్పుడు అదే సెంటిమెంటుపై కవిత కూడా అప్లై చేయాలనుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 2001 ఏప్రిల్ 27న కెసిఆర్ రాజీనామాల పర్వం ప్రారంభమైంది.. అలా డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యేకు, టిడిపి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. ఆ వెంటనే సిద్ధిపేట ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు.. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడవబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: