తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు  తిరుగులేని పార్టీగా నిలబడినటువంటి బీఆర్ఎస్, అధికారం కోల్పోయిన తర్వాత చాలా వరకు చతికిల పడుతోంది. ఆ పార్టీలో ప్రధాన భూమిక పోషించినటువంటి  కవిత పార్టీపై తిరుగుబాటు చేసింది. ఇదే క్రమంలో పార్టీ రోజు రోజుకు  డల్ అవుతుంటే  మరో నాయకుడు మల్లారెడ్డి పార్టీకి దూరం అవ్వబోతున్నాడని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ, దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి మల్లారెడ్డి సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రకంగా కనిపిస్తూనే ఉంటారు. ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అద్భుతంగా పనిచేశారు. అలాంటి మల్లారెడ్డి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి తెలంగాణ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పవచ్చు. 

ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే మల్లారెడ్డి తాజాగా బీఆర్ఎస్ పార్టీ మారబోతున్నారని ఒక వార్త వినిపిస్తోంది.. అయితే ఆయన తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లారు. అయితే ఆయన అక్కడికి వస్తున్నారని తెలుసుకున్న టిడిపి శ్రేణులు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పెద్దపెద్ద ఫ్లెక్సీలు కట్టి మరీ స్వాగతం పలికారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, కాళహస్తి ఎమ్మెల్యే gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి ఈ ఫ్లెక్సీ లో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీన్ని బట్టి చూస్తే మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి  టిడిపిలో చేరబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు ఆయనకు తెలంగాణ టిడిపి  అధినాయకుడిగా బాధ్యతలు కూడా ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తిరుమల తిరుపతి దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును కూడా చాలా వరకు పొగిడారు. చంద్రబాబు ఏపీని బాగా డెవలప్ చేస్తున్నారని, కేంద్రం నుంచి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నారని అన్నారు. ఇప్పుడు తెలంగాణ కంటే ఏపీ పైన ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని, ఇక్కడ భూముల రేట్లు పెరిగాయని తెలంగాణలో భూముల రేట్లు తగ్గాయని చెప్పుకొచ్చారు. ఇలా చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇదంతా గమనించినటువంటి కొంతమంది జనాలు ఈయన పార్టీ మారి టిడిపిలో చేరబోతున్నారనే వార్తలు క్రియేట్ చేశారు. మరి చూడాలి మల్లారెడ్డి నిజంగానే పార్టీ మారతారా, ఇదంతా ఒక రూమర్ లా కొట్టి పడేస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: