
వ్యవసాయం మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థ మనదే.. అందుకే మన రాష్ట్రంలో ఉండే ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అలాగే ప్రతి పంటకు రైతులకు గిట్టుబాటు ధర కలిగించేలా చూస్తున్నామని తెలియజేశారు. అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తున్నామని తెలిపారు. పురుగుల మందులు వాడకంలో దేశంలోని రెండవ స్థానంలో ఏపీ ఉందని అందుకే వాటిని తగ్గించాలని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నెలకు ఒక్కరోజైనా పొలం దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలంటు వెల్లడించారు.
అలాగే అసెంబ్లీలో ఒక రైతు గురించి మాట్లాడుతూ..కడప జిల్లాలోని లింగాల మండలంలో కొమ్మ నూతలకు చెందినటువంటి ఒక రైతు అతని పేరు పవన్ కళ్యాణ్.. అసాధారణ ప్రతిభను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అంతేకాకుండా ఆ రైతుకి అభినందనలు కూడా తెలియజేశారు చంద్రబాబు. జిబిఏ, ఆర్ఎస్కే ఒకటి మాత్రం చూపిస్తున్నాను.. ఇది లింగాల మండలంలో హార్టికల్చర్ పద్ధతి ఎప్పటినుంచో అక్కడ వచ్చింది. దానివల్ల రెండే రెండు పంటలు అక్కడ పండుతాయి. ఒకటి బనానా మరొకటి టమోటో వేస్తారు. గతంలో 2363 హెక్టార్లు ఉండేది. అది కూడా మొత్తం మైక్రో ఇరిగేషన్ ద్వారానే పెట్టారు. ఈ రోజున ఆ ఒక్క వ్యక్తి 580 కోట్ల రూపాయల జీబీఏ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇలా ఒక మారుమూల రైతు గురించి ప్రస్తావించడం సభలో సంచలనంగా మారింది.అందుకే ప్రతి ఒక్కరు కూడా హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్ పద్ధతికి రావాలని కోరుకుంటున్నాను అంటు తెలియజేశారు రాబోయే రోజుల్లో వీటికోసం కృషి చేస్తామంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు.