
అంతర్గతంగా నాయకులు ఆమెకు సహకరించిన నేపథ్యంలో షర్మిల రూట్ మార్చుకున్నారు. అయితే ఈ విషయంలో ఆమె అతిగా ప్రవర్తించడం వల్ల అతిగా విమర్శలు చేయటం వల్ల మొత్తానికే ఆమె మైనస్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని ఆమె గ్రహించలేక పోతే ముందు ముందు రాజకీయంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులను వినియోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను బాగు చేస్తామని, కొత్త ఆలయాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
అయితే ఈ విషయంలో షర్మిల.. చంద్రబాబును విమర్శిస్తూనే మరోవైపు బిజెపిని టార్గెట్ చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని రాష్ట్రంలో రుద్దుతున్నారని దీనిని చంద్రబాబు పుణికి పుచ్చుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఇది తీవ్ర వివాదంగా మారింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నుంచి మహిళా నాయకురాలు యామిని శర్మ వరకు షర్మిలపై విరుచుకుపడ్డారు. మాధవైతే తీవ్ర విమర్శలతో చెలరేగిపోయారు. ఆమెకు అజ్ఞానం.. అవివేకం .. తప్ప ఇంకేమీ లేవని విమర్శలు గుప్పించారు. యామిని శర్మ అయితే నీ సొంత తాత సొమ్ము ఏమైనా ఇస్తున్నావా అంటూ నిప్పులు జరిగారు.
దీంతో వైసిపి శిబిరం నుంచి ఆనందం వ్యక్తం కాగా టిడిపి నాయకులు మౌనం పాటించారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు నోరెత్తలేదు. ఈ పరిణామాల్ని గమనిస్తే అనవసర విషయాలను జోక్యం చేసుకొని షర్మిల కొత్త వివాదాలను సృష్టించుకుంటున్నారన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో సాగుతూ ఉండడం గమనార్హం. అంతేకాదు తాను ఏ మతాన్ని ఆరాధించినప్పటికీ హిందూ సామాజిక వర్గాన్ని కలుపుకొని వెళ్లే విషయంలో కూడా షర్మిల చేస్తున్న రాజకీయాలను మాధవ్ ప్రశ్నించటం విశేషంజ ఈ విషయంలో కనుక షర్మిల జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో వ్యక్తిగతంగా ఆమెకు. పార్టీ పరంగా కూడా తీవ్ర నష్టం వాటిలే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.