
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడో అప్పటినుంచి నేషనల్ హైవే పనులు, అమరావతి రాజధాని అభివృద్ధి పనులు, అలాగే విమానాశ్రయ నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం మెడలు వంచి మరీ అనేక నిధులు తీసుకువస్తున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల కోసం మరో అద్భుతమైన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏంటయ్యా అంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్.. అయితే ఈ సంస్థను తీసుకురావడం కోసం భారత్ ఏఐ శక్తి పేరుతో గూగుల్ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మిగతా ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రూ:87,500 కోట్ల పెట్టుబడులతో ఈ సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.