ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూటమిగా ఉండడంతో ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటోంది. ముఖ్యంగా అమరావతి నిర్మించడంపై, పోలవరం పనులకు సంబంధించి అన్ని విధాలుగా సపోర్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఆంధ్రాలో మరో 2 వంద పడకల (ESI ) ఉద్యోగుల రాష్ట్ర బీమా ఆసుపత్రిని నిర్మించడానికి చర్యలు జరుగుతున్నట్లు కేంద్ర కార్మిక ,ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించారు. నిన్నటి రోజున నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానాన్ని ఇచ్చారు.




నెల్లూరు జిల్లాలో రెండు 100 పడకల ESI ఆసుపత్రిని నిర్మించడానికి ఆమోదం తెలిపామని ఇందుకు సంబంధించి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆమోదం తెలిపిందని తెలియజేశారు మంత్రి శోభా కరంద్లాజే. శ్రీ సిటీలో  ప్రతిపాదన ప్రకారం 100 పడకల ESI  ఆసుపత్రితో పాటుగా, సిబ్బందికి కావాల్సిన క్వార్టర్లకు సంబంధించి 5 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించామంటూ తెలియజేశారు. జూన్ 27 2025 జరిగిన 196వ సమావేశంలో వీటిని ఆమోదించామంటూ తెలియజేశారు. అలాగే నెల్లూరు నగరంలో రెండవ ఆసుపత్రి విషయంపై ESIC యాజమాన్యంలోని 2 ఎకరాల స్థలంలో దీనిని పూర్తి చేస్తామంటూ తెలియజేశారు మంత్రి శోభా.


అలాగే రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది యొక్క పరిస్థితిని గుర్తించి క్వార్టర్ల  కోసం ప్రత్యేకించి మరో ఎకరం స్థలాన్ని ఇచ్చినట్లుగా తెలియజేశారు. అయితే వీటిని నిర్మించడానికి (ESIC ) భూమి అనుకూలతను, టెండర్ ప్రక్రియతో సహా సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నామని. త్వరలోనే అన్ని తెలియజేస్తామంటూ తెలియజేశారు మంత్రి శోభా కరంద్లాజే. దీన్నిబట్టి చూస్తూ ఉంటే  ఈ రెండు ఆసుపత్రులను అధునాతన టెక్నాలజీ కలిగి ఉన్న హాస్పిటల్ గా నిర్మించబోతున్నట్లు వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఏపీ ప్రభుత్వం తెలియజేస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: