ఎన్నికలు సమీపిస్తున్న వేల ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది, పార్టీలన్నీ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య పోరు తీవ్రతరంగా నడుస్తుండగా కొత్తగా రేసులోకి వచ్చిన జనసేన కూడా క్రియాశీలక పాత్ర పోషించే దిశగా ముమ్మరంగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కర్నూల్ ప్రచార సభలో సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని జగన్ అన్నారు.



ంద్రబాబు ఐదేళ్ల పాలనలో పేదల బతుకులు ఏ మాత్రం మారలేదని ఆయన అన్నారు. చంద్రబాబు దేశంలో అత్యంత ధనిక సీఎంగా నిలిచారని జగన్ అన్నారు. ముఖ్యమంత్రిగా రైతులకు, నిరుద్యోగులను ఆదుకోవాల్సింది పోయి ప్రజల సొమ్ముని దోచుకున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కువ రుణభారం మన రాష్ట్ర రైతులపైనే ఉందని అన్నారు. ఇలాంటి సీఎం వల్ల రాష్ట్రానికి నష్టమే అని చెప్పుకొచ్చరు.వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని మొదటి సంవత్సరంలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని అన్నారు.

రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో చాలా వరకు ఇతర రాష్ట్రాలకు సంబందించిన వారే ఉన్నారని, తాము అధికారంలోకి వస్తే 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టుల పనులన్నీ నత్త నడకన సాగుతున్నాయని, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ అత్యధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని, ప్రత్యేక హోదా ముందుగా ప్రకటించిన వారికే కేంద్రంలో మద్దతు ఇస్తామని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: