ప్రస్తుత కాలంలో  మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట  వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే  అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..ప్రవర్తన అనేది చెట్టు అయితే, గుర్తింపు అనేది దాని నీడ లాంటిది..!


దీని వివరణ ఏమిటంటే.. మన ప్రవర్తన అనేది ఎప్పుడూ చెట్టు అలాగే ఉండాలి. చెట్టు అనేది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.  ఎన్నో రాళ్ల దెబ్బలు తగిలినప్పటికీ,  మనకు తీయటి ఫలాలను అందిస్తుంది.  అంటే మన ప్రవర్తన కూడా చెట్టు యొక్క ప్రభావం లాగానే ఉండాలి. మనం ఒక్కటే బాగుపడితే సరిపోదు. మనతో పాటు ఇతరులు కూడా బాగుపడాలి.  ఒక  చెట్టు,  మనిషికి ఏవిధంగా ఉపయోగపడుతుందో, మనిషి కూడా మరొక మనిషికి ఆ విధంగానే ఉపయోగపడాలి. అప్పుడే  గుర్తింపు కూడా దాని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. అని దీని అర్థం.


ఉదాహరణకు ఎవరైనా ఏదైనా సహాయం చేయమని అడిగినప్పుడు,  లేదనకుండా చేతనైన సహాయం చేయాలి. ఒక చెట్టు పుట్టినప్పటినుండి అది చనిపోయిన తరువాత కూడా మనిషికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనిషి ప్రవర్తన కూడా అదే విధంగా ఉండాలి. మన వెంట ఏది తీసుకు పోలేము. బ్రతికున్నంత కాలం మనం ఇతరులతో ఎలా ప్రవర్తించాము అనేది మాత్రమే మన వెంట వస్తుంది. కాబట్టి నలుగురిలో మంచిగా బతకడానికి ప్రయత్నం చేయాలే తప్పా, స్వార్థం, ఈర్ష వంటివి మన మనసులో నింపుకోకూడదు. మనం ఎంత అయితే ఎదుటి వాళ్ళని ప్రేమిస్తామో, అంతే స్థాయిలో మనకు గుర్తింపు కూడా లభిస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: