ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా జరుగుతుంది. సీనియర్ ఆటగాళ్లతో పాటు జూనియర్ ఆటగాళ్లు సైతం అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కొంత మంది ఆటగాళ్లు ప్రతి సీజన్ లాగే మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అటు కోల్కతా నైట్రైడర్స్ జట్టు పేలవ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ఆ జట్టుకు కెప్టెన్ మారిన కూడా ఎందుకొ అదృష్టం మాత్రం కలిసిరావడంలేదు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లో  కోల్కతా నైట్రైడర్స్ జట్టు బరిలోకి దిగుతుంది అన్న విషయం తెలిసిందే.



 కానీ వరుస పరాజయాలతో ప్రస్తుతం జట్టు సతమతమవుతోంది. అయితే అటు జట్టు ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ కోల్కతా జట్టు లో ఒక ఆల్రౌండర్ మాత్రం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో మంచి ప్రదర్శన చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాడు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టడమే కాదు ఆటో బ్యాట్ తో కూడా భారీగా చేస్తూ ఉన్నాడు. అతను ఎవరో కాదు సునీల్ నరైన్ ఎన్నో సీజన్ల నుంచి కోల్కతా నైట్రైడర్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు సునీల్ నరైన్. అయితే ఐపీఎల్ లో ఎంతో మంది బౌలర్లు ఉన్నప్పటికీ సునీల్ నరైన్ బౌలింగ్ మాత్రం ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి.


 అతను బౌలింగ్ చేసే విధానం బ్యాట్స్మెన్లను  తికమక పడుతూ ఉంటుంది. ఇకపోతే ఇటీవలే లక్నో జట్టులో ఏకంగా 75 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది కోల్కతా నైట్రైడర్స్ జట్టు. కానీ సునీల్ నరైన్ మాత్రం ఒక అరుదైన రికార్డు సాధించాడు. వంద వికెట్లు 1000 పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నరైన్ కంటే ముందు బ్రావో, రవీంద్ర జడేజా ఈ ఘనత సాధించడం గమనార్హం. అంతేకాదు వరుసగా మూడో సీజన్లలో 20కి పైగా వికెట్లు తీసిన బౌలర్ గా సునీల్ నరైన్ ఒక అరుదైన రికార్డును నమోదు చేశాడు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl