ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంత ఘోరంగా విఫలమైంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లోనే కొనసాగుతూ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది మాత్రం కనీస ప్రదర్శన చేయలేక తీవ్రంగా నిరాశపరిచింది. ఏకంగా 14 మ్యాచ్ లలో కేవలం నాలుగు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి మునుపెన్నడూ లేనంత పేలవ ప్రదర్శన కనబరిచింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే అటు చెన్నై సూపర్ కింగ్స్ ఎంత పేలవ ప్రదర్శన చేసినప్పటికీ ఆ జట్టులో ఉన్న కొంతమంది యువ ఆటగాళ్లు మాత్రం తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.


 అలాంటి వారిలో ముఖేష్ చౌదరి సిమ్రాన్ జిత్ సింగ్ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యువ ఆటగాడు సిమ్రాన్ జిత్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  జట్టులోని యువ ఆటగాళ్లను ప్రోత్సహించి వారిని సంసిద్ధం చేయడంలో ధోనీ ఎంతో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు అంటూ సిమ్రాన్ జిత్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో 6 మ్యాచ్ లు ఆడిన సిమ్రాన్ జిత్ నాలుగు వికెట్లు పడగొట్టడమే.. కాదు తక్కువ పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒత్తిడిలో ఎంతో ప్రశాంతంగా ఉండటం మహేంద్రసింగ్ ధోని చూసి నేర్చుకున్నాను.


 ఇక తాను బౌలింగ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ధోనీ ఎప్పుడు విలువైన సలహాలు ఇస్తూ ఉంటాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో తాను బాగా బౌలింగ్ చేశానని మహేంద్రసింగ్ ధోని మెచ్చుకోవడంతో ఎంతో ఆనందపడ్డాను. ఇక సన్రైజర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచ్ లో నేను ఐపీఎల్ లో నా తొలి మ్యాచ్ ఆడాను. ఇక మ్యాచ్ మధ్యలో కాస్త ఒత్తిడికి గురయ్యాను. బెంచ్ స్ట్రెంత్ కు ప్రయత్నం కావటానికి ఎలవెన్ లో భాగం కావడానికి ఎంతో తేడా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl