గత కొంత కాలం నుంచి ఫాన్స్ టీనేజ్ క్రికెటర్ గుస్తావ్ మోకీయన్  గురించే అటు ప్రపంచ క్రికెట్ లో చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే గత కొంత కాలం నుంచి టి20 ఫార్మాట్ క్రికెట్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు యువ ఆటగాడు. మూడు రోజుల కింద టీ20 క్రికెట్ లో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇటీవలే మరో సెంచరీ అందుకుని ఇంకో ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు. టి 20 క్రికెట్ లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్గా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అనే చెప్పాలి. ఇటీవల యూరప్ టి20 వరల్డ్ కప్ 2024 సబ్ రీజినల్స్ లో భాగంగా గ్రూప్ బిలో నార్వే తో జరిగిన మ్యాచ్ లో యువ ఆటగాడు 53 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతో 106 పరుగులు సాధించాడు. ఇక ఇది అతనికి వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం.


 ఇక అంతకు ముందు స్విట్జర్లాండ్ లో జరిగిన మ్యాచ్లో 61 బంతుల్లోనే శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఇదే వరల్డ్ కప్ లో చెక్ రిపబ్లిక్ తో జరిగిన మ్యాచ్ లో టీ20 క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు ఈ యువ ఆటగాడు. ఇక ఆరంభం మ్యాచ్లోనే 54 బంతుల్లో 77 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే మరో అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నాడు ఈ యువ ఆటగాడు. వరుసగా తొలి 3 టీ20 మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. వరసగా 79, 109, 101 పరుగులు చేసి మొత్తంగా 286 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక పోర్చుగల్ కు చెందిన క్రికెటర్ అజర్ ఆదాని 227 పరుగులతో రెండో స్థానంలో ఉండడం గమనార్హం.


 ఇక మ్యాచ్ విషయానికి తొలుత బ్యాటింగ్ చేసిన ఫ్రాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 నష్టానికి 158 పరుగులు చేయగా ఇందులో గుస్తావ్ మోకీయన్ ఒక్కడే 101 పరుగులు చేశాడు. ఆ తర్వాత నార్వే 19.2 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫ్రాన్స్ విజయం సాధించింది. అంతేకాదు ఇక ఈ యువ ఆటగాడు బౌలింగ్ లో కూడా అదరగొట్టి మూడు వికెట్లు తీశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: