ఇంకాసేపట్లో టీ 20 వరల్డ్ కప్ లో కీలక మ్యాచ్ స్టార్ట్ కానుంది. వర్షం కారణంగా సెమిస్ అవకాశాలు కొన్ని జట్లకు ఇబ్బందిగా మారేలా ఉంది. డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఆడాల్సిన అయిదు మ్యాచ్ లలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. వాటిలో ఒకటి గెలవగా, ఒకటి ఓడింది మరియు మరొకటి వర్షం కారణంగా రద్దయింది. దీనితో ఇక మిగిలిన రెండు మ్యాచ్ లను భారీ తేడాతో గెలవాలి మరియు అదే సమయంలో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. అయితే ఈ రోజు బ్రిస్బేన్ వేదికగా ఐర్లాండ్ తో మ్యాచ్ జరగనుంది, కానీ ఐర్లాండ్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా కన్నా మెరుగైన స్థానంలో ఉంది. ఐర్లాండ్ మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిస్తే సెమీస్ కు వెళ్లే ఛాన్స్ ఉంది.

కాబట్టి రెండు జట్లకు కూడా ఇది చాలా కీలకమైన మ్యాచ్. ఖచ్చితంగా ఒత్తిడి ఆస్ట్రేలియాపైనే ఉంటుంది, ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోతే సెమీస్ దారులు మూసుకుపోయినట్లే. మొదట టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఆరంభం నుండి ధాటిగా ఆడి భారీ టార్గెట్ ను సెట్ చెయ్యాలి, లేదంటే ఐర్లాండ్ నుండి షాక్ తప్పదు. ఆస్ట్రేలియా గెలిచిన ఏకైక మ్యాచ్ లో స్టాయినిస్ బ్లిండర్ ఇన్నింగ్స్ ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మరి ఈ రోజు మ్యాచ్ లోనూ అతను చెలరేగి ఆడితే ఐర్లాండ్ కు చిక్కులు తప్పవు.

ఇరు జట్లు కూడా గత మ్యాచ్ లో ఆడిన ప్లేయర్స్ తోనే బరిలోకి దిగాయి. పిచ్ ను బట్టి చూస్తే బ్యాటింగ్ కు స్వర్గధామంగా ఉండనుంది అని తెలుస్తోంది. ఓపెనర్లు మంచి స్టార్ట్ ను అందిస్తే ఆస్ట్రేలియా 180 కి పైగానే పరుగులు సాధించవచ్చు. ఇక బ్యాటింగ్ లో విఫలం అవుతున్న పించ్, మిచెల్ మార్ష్ మరియు మక్సవెల్ లు రాణించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఐర్లాండ్ సమిష్టిగా ఆడి ఆస్ట్రేలియా సెమీస్ ఆశలకు గండి కొడుతుందా లేదా ఆస్ట్రేలియా అనుభవంతో ఆడి సెమీస్ కు మరింత దగ్గరవుతోందా చూడాలి.  




మరింత సమాచారం తెలుసుకోండి: