ఇటీవల టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వైఫల్యం నేపథ్యంలో ఎన్నో కొత్త విషయాలు తెర మీదకి వచ్చి చర్చనీయాంశంగా మారిపోయాయి అని చెప్పాలి. ఒకవైపు టీమిండియా ఆటగాళ్లు పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడిపోతున్న అదే పిచ్ లపై ఇక ప్రత్యర్థి  ఆటగాళ్లు మాత్రం సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతూ పరుగుల వరద పారించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. ఇక ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లుగా  పేరున్న టీమిండియా ప్లేయర్స్ ఎందుకు ఇలా వైఫల్యం చెందుతున్నారు అన్నదానిపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలోనే ఒక కొత్త విషయం తెర మీదకి వచ్చింది అన్న విషయం తెలిసిందే.. విదేశీ ఆటగాళ్లందరూ కూడా ఒకవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పాటు ఇక మిగతా దేశీయ లీగ్ లలో కూడా ఆడుతూ ఉన్నారు. తద్వారా ఇక విదేశీ పరిస్థితిలను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోగలిగే సామర్ధ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఇక దేశీయ లీగ్ ల కారణంగా ప్రత్యర్థి ఆటగాళ్ల బలాబలాల పై అవగాహన వస్తుంది. ఇక అక్కడి పిచ్ లపై కూడా ఎలా ఆడాలి అన్న విషయంపై అనుభవాన్ని సంపాదించుకుంటున్నారు..


 కానీ టీమిండి ఆటగాళ్లు మాత్రం ఒక్క ఐపీఎల్ మినహా మిగతా విదేశీ లీగ్లలో ఆడకపోవడమే వారికి మైనస్ గా మారింది అని చర్చ తెరమీదకి వచ్చింది. కాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశీయ క్రికెట్ ఉండగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్లు ఆడాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లు  నైపుణ్యం కోసం కొత్త అవకాశాలను అందుకోవడానికి దేశీయ క్రికెట్ లోనే కావలసినన్ని అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ సహా మరికొన్ని దేశీయ లీగ్ లలో ఆడటం వల్ల ఎంతో అనుభవం వస్తుంది. ఇక దీనికోసం ప్రత్యేకంగా విదేశీ లీగ్ లు ఆడాల్సిన అవసరం లేదు అంటూ రవి శాస్త్రి  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: