ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ గెలుస్తుంది అనుకున్న భారత జట్టు సెమి ఫైనల్లో ఘోర ఓటమి చవిచూసి ఇంటిదారి పట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా దారుణమైన ఓటమిని చవిచూడటంపై అటు అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇక వరల్డ్ కప్ ముగిసినప్పటికీ టీం ఇండియా వైఫల్యం గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ముగ్గురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకోకపోవడం కారణంగానే టీమిండియా ఓడిపోయింది అంటూ కొత్త వాదన తెరమీదకి తీసుకువచ్చారు టీమ్ ఇండియా అభిమానులు.


 గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది అని గుర్తు చేస్తూ ఉన్నారు. ఓపెనర్లు విఫలమైన సమయంలో మిగతా బ్యాట్స్మెన్ లపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. అప్పుడు కూడా  కోహ్లీ తప్ప మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఇలా యూఏఈ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఓటమి నుంచి భారత్ ఏం పాటలు నేర్చుకోలేదు అన్నది అర్థమవుతుంది అంటూ టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ క్రమంలోనే ఈ ముగ్గురు ఆటగాళ్లు జట్టులో ఉండి ఉంటే టీమిండియా గెలిచేది అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే..

 సంజు శాంసన్ : రాజస్థాన్ రాయల్స్ సారధిగా కొనసాగుతున్న సంజు శాంసన్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో ఎంత అదరగొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా ఓపెనర్ గా బరిలోకి దిగి ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తంగా ఐపీఎల్ సీజన్లో 643 పరుగులు చేశాడు సంజు శాంసన్. అలాంటి ఆటగాడిని కనీసం జట్టులోకి తీసుకునేందుకు కూడా ఆలోచన చేయలేదు టీమిండియా యాజమాన్యం.


 రాహుల్ త్రిపాటి  : సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో మిగతా బ్యాట్స్మెన్లు విఫలమైన కూడా మిడిల్ ఆర్డర్లో జట్టుకు వెన్నుముక్కల మారిపోయిన ఆటగాడు రాహుల్ త్రిపాఠి. ధన ధన్ బ్యాటింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఏకంగా ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్లో 147 కు పైగా స్ట్రైక్ రేట్తో 597 పరుగులు చేశాడు. అయినా అతనికి జట్టులో చోటు దక్కలేదు.

 పృద్వి షా  : ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వి షా  ఓపినర్ గా బరిలోకి దిగి ఎంతలా విధ్వంసం సృష్టించాడో అందరూ చూశారు. పవర్ ప్లే లో ఉండే పరిమితులను ఉపయోగించుకొని చెలరేగిపోయాడు. ఇక 161 స్ట్రైక్ రేట్ తో 587 పరుగులు చేశాడు. అయితే ఇంత మంచి ప్రదర్శన చేసిన ఈ ముగ్గురిని పట్టించుకోలేదు టీమ్ ఇండియా సెలెక్టర్లు. చివరికి దీనికి ప్రతిఫలం టీమిండియా ఓటమి అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: