ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతుంది భారత జట్టు.  అయితే ఎంతో బలహీనంగా ఉన్న బంగ్లాదేశ్ జట్టును  వారి సొంత గడ్డపైనే పటిష్టమైన టీమిండియా చిత్తుగా ఓడించడం ఖాయమని భారత అభిమానులు అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. వన్డే సిరీస్ లో భాగంగా టీమిండియా కు గట్టి పోటీ ఇచ్చిన బంగ్లాదేశ్ జట్టు వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ క్రమంలోనే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు.


 ఇక ఇలా వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన టీమ్ ఇండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ఒకవైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్ లో కూడా అటు టీమ్ ఇండియా జట్టు ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. అయితే కనీసం మూడో మ్యాచ్లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకుంటుంది అని అటు భారత అభిమానులు అనుకుంటున్నారు. అదే సమయంలో టీమిండియాని  గాయాలు బెడద వేదిస్తూ ఉండడం కూడా అందరిని అయోమయంలో పడేస్తుంది అని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఇక మూడో వన్డేలో టీమిండియా తప్పక విజయం సాధించాల్సిన అవసరం ఉంది అంటూ టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక వన్డే సిరీస్ ముగిసిన వెంటనే బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఈ క్రమంలోనే వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ మూడో వన్డే మ్యాచ్లో మాత్రం టీమిండియా గెలవాల్సిన అవసరం ఉంది అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే మూడో వన్డేలో గెలిస్తే ఇక టెస్ట్ సిరీస్ కు టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది  తెలిపాడు సునీల్ గవాస్కర్. కాగా శనివారం నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్ జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: