సాధారణంగా ఐపీఎల్ లో కెప్టెన్ గా మారిపోయి జట్టును ముందుకు నడిపించడం కంటే అటు రంజీ ట్రోఫీలో ఒక జట్టుకు కెప్టెన్ గా ఉండడం అనేది చాలా కష్టం అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఎంతో మంది యువ క్రికెటర్లు కూడా ఇలా రంజీ ట్రోఫీలో కెప్టెన్సీ అవకాశం వస్తే బాగుండు అని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. అంతే కాదు ఐపీఎల్ కంటే అటు రంజీ ట్రోఫీని అత్యుత్తమమైన టోర్నీగా భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు మాత్రమే ఇలా కెప్టెన్సీ వహించే అవకాశాన్ని దక్కించుకుంటారు. అలాంటిది 20 ఏళ్ల యష్ దుల్ ఇటీవల ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు.


 2022- 23 రంజీ ట్రోఫీ సీజన్ కు సంబంధించి ఢిల్లీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు.  ఐపీఎల్ స్టార్ ప్లేయర్ అయిన నితీష్ రానా తో పాటు 105 టెస్టుల అనుభవం ఉన్న సీనియర్ ఇషాంత్ శర్మ కూడా యష్ దుల్ కెప్టెన్సీలో రంజీ సీజన్ ఆడబోతున్నాడు అన్నది తెలుస్తుంది.  కాగా  ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యువ ఆటగాడు యష్ దుల్. 8 మ్యాచ్ లు ఆడి 74.54 సగటుతో 820 పరుగులు చేశాడు. ఇక ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉండడం గమనార్హం. అయితే యష్ దుల్ కి ఇప్పటికే కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది అని చెప్పాలి. అండర్ 19 జట్టుకి ఆసియా కప్, వరల్డ్ కప్ సమయంలో కెప్టెన్సీ వహించి టైటిల్స్ అందించాడు.


 ఇక దేశవాళి క్రికెట్లో కెప్టెన్గా అదరగొట్టి అందరు దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పాలి. 2022లో కూడా రంజీ ట్రోఫీలో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్రం  మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇక ఆ తర్వాత చత్తీస్గడ్  తో జరిగిన మ్యాచ్ లో డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే అతని ప్రదర్శనకు మెచ్చిన ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఇక అతనిలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని భావించి  కెప్టెన్సీ అప్పగించినట్లు తెలుస్తుంది. ఇక యష్ దుల్ తన కెప్టెన్సీ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలని మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: