భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తనంతట తానుగా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.ఇక మూడు ప్రపంచకప్‌లను గెలుచుకున్న యువరాజ్ అందరి హృదయాల్లో గుర్తుండిపోయేలా ముద్రవేశాడు. యూవీకి నేటితో 41 సంవత్సరాలు నిండాయి. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చి కూడా చాలా రోజులైంది. అయితే ఈ రోజు కూడా ఆయన ఇన్నింగ్స్‌లు కొన్ని ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎప్పటికీ కూడా గుర్తుండిపోయాలా ఉన్నాయి.1981 డిసెంబర్ 12న జన్మించిన యూవీ 2000 వ సంవత్సరంలో తొలిసారిగా భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించాడు.ఆయన ఆల్ రౌండర్ ప్రదర్శన కారణంగా, యువి టోర్నమెంట్ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే ఇక ఈ బలమైన ప్రదర్శన కారణంగా, అతను సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ODIలలో కెన్యాపై అక్టోబర్ 2000లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు యువి. ఇక ఆ తర్వాత, యూవీ ఏమాత్రం కూడా వెనుదిరిగి చూడలేదు. ఆయన మైదానంలో ప్రతిరోజూ కొత్త అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు.ఇక 2007 వ సంవత్సరంలో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ విజయంలో యూవీ సహకారం కూడా చాలా అంటే చాలా ఉంది. అదే టోర్నీలో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి విధ్వంసం సృష్టించాడు యువరాజ్ సింగ్.


అతను 12 బంతుల్లో వేగవంతమైన అంతర్జాతీయ టీ20 అర్ధ సెంచరీని కూడా నమోదు చేసి ఇప్పటికీ కూడా చెరగని ముద్ర వేసుకున్నాడు.ఇంకా అలాగే 2011 వ సంవత్సరంలో భారత్ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ విజయంలో హీరో కూడా మన యువరాజ్ సింగే. అప్పుడు యువరాజ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. మొత్తం 362 పరుగులతో పాటు 15 వికెట్లు తీశాడు. ఇంకా అలాగే యువరాజ్ తక్కువ సమయంలో ఛాంపియన్ ప్లేయర్ అయ్యాడు.2011 ప్రపంచకప్ అయిపోయిన వెంటనే, యూవీకి క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ తర్వాత ఆయన అసలు పోరాటం ప్రారంభమైంది. ఆయన అప్పుడు USAలో చికిత్స పొందాడు. చాలా పోరాటం తర్వాత క్యాన్సర్‌ను ఓడించగలిగాడు. దీని తర్వాత మళ్ళీ ఆయన రంగంలోకి దిగాడు. 2017 వ సంవత్సరం వరకు జట్టులో ఉన్నాడు. కానీ, ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు. అందువల్ల ఆయనకి జట్టులో చోటు దక్కలేదు. 2019 వ సంవత్సరంలో ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరైన యువీ తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: