
ఇటీవల రంజి టోపీలో భాగంగా కేరళతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న దీపక్ హుడా సెంచరీ తో చలరేగిపోయాడు. 187 బంతుల్లో 133 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు ఒక సిక్స్ ఉండడం గమనార్హం. ఇలా సెంచరీ తో చలరేగిపోయిన దీపక్ హుడా అటు జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఎలా గత కొంతకాలం నుంచి టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఛాన్స్ దక్కించుకుని తమ ప్రదర్శనతో అదరగొడుతున్న దీపక్ హుడా ఇక ఇప్పుడు రంజి టోపీలో కూడా అదే అద్భుతమైన పాము కొనసాగిస్తున్నాడు.
ఇక దీపక్ హుడా అద్భుతమైన సెంచరీ తో చెలరేగిపోవడంతో ఇక అతను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది అని చెప్పాలి. కేరళతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడిపోయి తోలుత బ్యాటింగ్ కు దిగింది రాజస్థాన్ జట్టు. దీపక్ హుడా అద్భుతమైన సెంచరీ తో పాటు యష్ కొఠారి 58, సల్మాన్ ఖాన్ 62 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలోనే తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది రాజస్థాన్ జట్టు.