భారత క్రికెట్ ప్రేక్షకులు, ఎంతోమంది క్రికెటర్లు ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం రేపే జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. కొచ్చి వేదికగా మెనీ వేలం ప్రక్రియ జరగబోతుంది. ఇక ఈ మినీ వేలంలో తమ జట్టును మరింత పటిష్టవంతంగా మార్చుకునేందుకు సరికొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయడమే లక్ష్యంగా అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి ఆయా ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే మినీ వేలంలో ఫ్రాంచైజీలు  ఏ ఆటగాడి కోసం పోటీ పడబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఇక పది ఫ్రాంచైజీలు  కలిసి 87 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇందుకోసం 405 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు అన్న విషయం తెలిసిందే. మినీ వేలంలో ఉన్న ప్లేయర్లలో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు కూడా ఉండడం గమనార్హం. దీంతో స్టార్ ప్లేయర్లు భారీ ధరకు అమ్ముడుపోతారు అని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. అయితే గత ఏడాది మెగా వేలంలో ప్రేక్షకుల అంచనాలు తారుమారు అయి.. ఫ్రాంచైజీలు  అన్నీ కూడా యువ ఆటగాళ్లకే పెద్దపీట వేసాయి. మరి ఇక ఈ మినీ వేలంలో ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 అదే సమయంలో ఈ మినీ వేలంలో ఎక్కువ ధర పలకబోయే ఆటగాడు ఎవరూ అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అదే సమయంలో ఇక గత ఐపీఎల్ సీజన్లలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ ఎవరు అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.. ఆ వివరాలు చూసుకుంటే.

 2014, 2015 ఐపీఎల్ సీజన్లలో యువరాజ్ సింగ్ ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా కొనసాగాడు. 2016లో షేన్ వాట్సన్ ఎక్కువ ధరను సొంతం చేసుకున్నాడు. 2017లో బెన్ స్టోక్స్ ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. 2019లో జయదేవ్ ఉన్నద్గత్, 2020లో ప్యాట్ కమిన్స్, 2021 లో మోరిస్, 2022లో ఇశాన్ కిషన్, ఖరీదైన ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు అని చెప్పాలి. మరి ఈ ఏడాది ఖరీదైన ఆటగాళ్లుగా ఎవరు మారబోతున్నారు అన్నది తెలియాలంటే మినీ వేలం పూర్తయ్యేంతవరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl