బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇక ఆతిథ్య టీమిండియాతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఇరు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఇక ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో కూడా అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. టీమిండియా బౌలింగ్ విభాగం ముందు అటు ఆస్ట్రేలియా కుప్పకూలిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ఇక ప్రస్తుతం ఇరు జట్లు కూడా రెండవ టెస్టు మ్యాచ్ కోసం సిద్ధం అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వరకు బిసిసిఐ ఇక రెండు టెస్టులకు సంబంధించిన జట్టు వివరాలను... ఇక ఈ రెండు టెస్టులు జరగబోయే వేదికలను కూడా ప్రకటించింది అని చెప్పాలి. అయితే మిగిలిన రెండు టెస్టులు కూడా ఎక్కడ నిర్వహిస్తారు. ఇక తుది జట్టులోకి ఎవరు వస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే బీసీసీఐ ఇక ఈ వివరాలను ఇటీవలే ప్రకటించింది అన్నది తెలుస్తుంది. మూడవ టెస్ట్ మ్యాచ్ భారత జట్టుకు బాగా అచ్చొచ్చిన మైదానంలో జరగబోతుంది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


 ప్రస్తుతం మూడో టెస్ట్ కోసం భారత్ ప్రకటించిన కొత్త వేదికలో టీమిండియా కు మంచి రికార్డు ఉంది అని చెప్పాలి. ఇండోర్లోని హోల్కల్ స్టేడియంలో ఇప్పటివరకు టీమిండియా ఆడిన 2 టెస్ట్ మ్యాచ్ లలో కూడా ఘనవిజయాన్ని అందుకుంది. 2016లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టుల్లో కోహ్లీ డబుల్ సెంచరీ, రహానే 188,  పూజార సెంచరీలతో అదరగొట్టారు. 2019లో బంగ్లాదేశ్ తో ఇదే మైదానంలో మ్యాచ్ జరిగింది. మాయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మూడో టెస్ట్ ఇదే స్టేడియంలో  జరగబోతుంది అని చెప్పాలి. దీంతో టీమిండియా ఈసారి కూడా అదరగొట్టడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: