
రెగ్యులర్ ఆటతీరులో కాకుండా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆడినట్లుగా ఎంతో దూకుడుగా ఆడి ఇక ప్రత్యర్థులపై పైచేయి సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతుంది. కాగా ఇంగ్లాండ్ ప్రస్తుతం బజ్ బాల్ అనే విధానాన్ని అవలంబిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే సరికొత్త శైలి బ్యాటింగ్ ద్వారా భారీ టార్గెట్లను సైతం అలవోకగా చేదిస్తోంది. ఇక ఇటీవల న్యూజి ల్యాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ బజ్ బాల్ అమలు చేసింది అని చెప్పాలి. ఈ మ్యాచ్లో భాగంగా టాస్ ఓడిపోయిన ఇంగ్లాండు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.
ఈ క్రమంలోనే వన్డే క్రికెట్ తరహాలోనే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు అందరూ రెచ్చిపోయారు. 58.2 ఓవర్లలోనే 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది ఇంగ్లాండు జట్టు. ఈ క్రమంలోనే కెప్టెన్ బెన్ స్టోక్స్ అప్పటికే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇలా వన్డే క్రికెట్ తరహాలో బ్యాటింగ్ చేసి ఒక్కరోజులోనే భారీ స్కోరు సాధించింది ఇంగ్లాండ్. అయితే ఒక వికెట్ మిగిలి ఉన్న సమయంలో మరిన్ని పరుగులు చేసేందుకు అవకాశం ఉన్న ఇంగ్లాండ్ మాత్రం తమ బౌలింగ్ విభాగం పై ఉన్న నమ్మకంతో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం గమనార్హం. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో డకెట్ 84 హరి బ్రూక్స్ 89 పరుగులతో రాణించారు.