ప్రస్తుతం భారత జట్టు ఇండియా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా తో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఈ నాలుగు మ్యాచ్లలో భాగంగా రెండు మ్యాచ్లు ఇప్పటికే ముగిసాయి అన్న విషయం తెలిసిందే. అయితే రెండు మ్యాచ్లలో కూడా విజయం సాధించింది టీం ఇండియా జట్టు. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడో మ్యాచ్లో తలబడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకు ప్రతి మ్యాచ్ లో కూడా వణుకు పుట్టించే విధంగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. తన వైవిద్యమైన స్పిన్ బౌలింగ్ తో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు అందరికీ కూడా ముచ్చెమటలు  పట్టిస్తున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అశ్విన్ పేరెత్తితేనే గజగజ వణికి పోతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు అతని లాగా బౌలింగ్ చేసే మహేష్ పితియాను నియమించుకొని ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. దీన్ని బట్టి అశ్విన్ అంటే ఆస్ట్రేలియా బౌలర్లకు ఎంత భయమో అందరికీ అర్థమైంది అని చెప్పాలి. అయితే ఇక అందరూ నమ్మకం పెట్టుకున్నట్లుగానే అశ్విన్ కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కీలకమైన సమయంలో భారత జట్టుకు వికెట్లను అందిస్తూ ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ సందర్భంగా అశ్విన్ ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.


 భారత క్రికెట్ లెజెండ్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసేసాడు రవిచంద్రన్ అశ్విన్. ఇటీవలే మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అలెక్స్ కేరిని అవుట్ చేయడం ద్వారా అశ్విన్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో అశ్విన్ 688 వికెట్లు సాధించాడు. కాగా గతంలో కపిల్ దేవ్ సాధించిన 687 వికెట్లు అత్యధికంగా ఉండేవి. ఇక ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసేసాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక ఈ లిస్టులో అందరికంటే ముందు అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. 953 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత హర్భజన్ సింగ్ 707 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: