సాధారణంగా క్రికెట్లో క్రీడా స్ఫూర్తి అనేది ఎంతో ముఖ్యం అన్న విషయం తెలిసిందే. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకున్నప్పుడే ఇక అత్యుత్తమ క్రికెటర్గా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఇలా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన వారిని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం క్రికెటర్లు ఏకంగా సహనం కోల్పోయి బూతులు మాట్లాడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటివి అప్పుడప్పుడు స్టంప్స్ మైక్ లో రికార్డు అయి ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.



 ఇక ఇప్పుడు ఇలాంటిదే మరొకటి జరిగింది. ఏకంగా పాకిస్తాన్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న షాదాబ్ ఖాన్ ఇటీవల జరిగిన ఒక మ్యాచ్ లో వికెట్ కోల్పోవడంతో తన సహనాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలోనే విచక్షణ మరిచిపోయి బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే అదంతా స్తంప్ మైక్ లో రికార్డు కావడంతో ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నీలో ఈ ఘటన జరిగింది అని చెప్పాలి. ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు షాదాబ్ ఖాన్.


 24 బంతుల్లో 44 పరుగులు చేసి ఎంతో దూకుడుగా ఆడుతున్నాడు షాదాబ్ ఖాన్. ఈ సందర్భంగా 15వ ఓవర్లో నాలుగో బంతిని ముల్తాన్ సుల్తాన్ బౌలర్ ఎహసానుల్లా వెయ్యగా.. ఆ బంతికి బౌల్డ్  అయ్యాడు. ఇక మంచి జోరు మీద ఉన్న సమయంలో అనుకోకుండా క్లీన్ బోల్డ్ కావడంతో సహనం కోల్పోయాడు షాదాబ్కాన్. ఈ క్రమంలోనే ఏకంగా బ్యాట్ తో మైక్ ని కొట్టబోయాడు. ఇక బూతులు తిట్టుకుంటూ మైదానం బయటికి వెళ్లిపోయాడు అని చెప్పాలి. ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో క్రీడా స్ఫూర్తి అంటే ఇదేనా అంటూ ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: