సాధారణం గా ప్రతి బ్యాట్స్మెన్ కూడా భారీగా పరుగులు చేయడమె లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతూ ఉంటాడు. కానీ కొంత మంది ఆటగాళ్లకు మాత్రం కొన్ని కొన్ని సార్లు దురదృష్టం వెంటాడుతూ వికెట్ కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటిదే జరిగింది అన్నది తెలుస్తుంది.భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా చెన్నై జట్టు లోకి వచ్చిన ఆకాష్ సింగ్ బౌలింగ్ లో ఊహించని రీతిలో వికెట్ కోల్పోయాడు విరాట్ కోహ్లీ.


 ఇక అతను వికెట్ కోల్పోయిన తీరు చూసిన తర్వాత నిజంగానే అతన్ని దురదృష్టం వెంటాడిందని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ సింగ్ ను తీసుకుంది. తొలి ఓవర్ వేసేందుకు ధోని బంతిని ఆకాష్ సింగుకు అందించాడు. అయితే ఈ ఓవర్ లో రెండో బంతికి ఫోర్ కొట్టి విరాట్ కోహ్లీ మంచి జోరు కనబరిచారు అని చెప్పాలి. అయితే ఇదే ఓవర్లో ఐదో బంతిని విరాట్ కోహ్లీ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ చివరికి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని కోహ్లీ బూట్ ను తాకి స్టంప్ ను గిరాటేసింది. అయితే ఇలా జరుగుతుందని కోహ్లీ కూడా అస్సలు ఊహించలేదు. వికెట్ పడటంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో నిరాశతోనే కోహ్లీ మైదానాన్ని వీడాడు. కోహ్లీ వికెట్ పడగొట్టిన ఆకాష్ సింగ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీ ఇలా అనుకోని విధంగా అవుట్ కావడంతో ఫాన్స్ కూడా ఫీలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: