ఎప్పుడు ఏదొక గుడి వద్ద చాల సందర్భాల్లో చాలామంది అన్నదానం చెయ్యటం మనం చూస్తూ ఉంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు. అన్నదానం విశిష్టత ఏంటో కూడా తెలియదు. అయితే అన్నదానం అంటే ఏంటో.. ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకోండి. 


అన్నదానం చేయడంలో ఎంతో ఆనందం ఉంటుంది. అన్నదానం అంటే కేవలం ఆహారం అందించడమే కాదు, భౌతిక శరీరాన్ని 'అన్నమయ కోశం లేదా ఆహార శరీరం అని పిలుస్తాము, ఎందుకంటే ఇది ఆహార పోషకాలతో నిర్మించబడింది. కాబట్టి, మీరు అన్నదానం చేస్తే, వారికి శరీరాన్ని అందిస్తునట్లే' అని సద్గురు చెప్పారు. 


అన్నదానం చేసే సమయంలో ప్రేమ, అంకిత భావంతో వడ్డించడం ద్వారా ఎదుటి వారితో ఒక లోతైన సంబంధం ఏర్పడుతుంది. మీరు దీనిని గొప్ప అంకిత భావంతో చేస్తారు.. ఎందుకంటే దీని ద్వారా ఒకరికి జీవితాన్ని ఇచ్చే అవకాశం మీరు పొందుతున్నారు. అన్నదానం ఎంతో గొప్పది. 


ఎందుకంటే.. ఒక మనిషి మరొక మనిషి నుండి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాడు. ఆలా మనిషికి కావాల్సింది ఎంత ఇచ్చిన సరే ఇంకా ఇంకా అంటూ ఉంటాడు. డబ్బు ఇచ్చిన, స్థలం ఇచ్చిన సరే మీరు ఏమి ఇచ్చిన ఇంకా ఇంకా అని అడుగుతాడు.. కానీ ఆహారం మాత్రమే కడుపు నిండా తిని ఇంకా చాలు అని అంటాడు. అందుకే అన్నదానంకు అంత విలువ ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: