మంచు కొండల మధ్య  వెండివెన్నల్లా దర్శనమిస్తూ అతీంద్రియ మహాశక్తుల కళతో శోబిస్తూ  వేళ కాంతులను వెదజల్లుతూ సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉంటూ టెక్నాలజీకి, సైన్స్ కు అందని అద్బుతం పరమశివుని ఆవాసం ఆ కైలాస శిఖరం.  సముద్ర మట్టానికి 21, 778 వేల అడుగుల ఎత్తులో టిబెట్ బూ భాగంలో హిమాలయ పర్వతాలలో ఈ కైలాస పర్వతం కొలువై ఉంది. ఈ కైలాస పర్వతంపై శివపార్వతులు కొలువై ఉన్నారు అని ఒక ప్రగాఢ విశ్వాసం. అందుకే సాధారణ మనిషి ఎవరూ కూడా ఈ శిఖరాన్ని అదిరోహించడం కుదరదని, కేవలం మరణం తర్వాత మాత్రమే పుణ్యం చేసిన మనిషి ఆత్మ ఆ కైలాసానికి చేరుతుందని అంటుంటారు. ఎంతో విశిష్టత గాంచిన బ్రహ్మపుత్ర ఈ కైలాస పర్వత ప్రాంతంలోనే ఉండటం మరో విశేషం. హిందువులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మానవ మేథస్సుకు అంతు చిక్కని ఎన్నో రహస్యాలు అర్థంకాని విషయాలు ఎన్నో ఈ కైలాస పర్వతంపై ఉన్నాయి. 
* ఈ  కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో కనిపిస్తుంది.  అంతేకాదు నాలుగు రంగుల్లో ఇది కనిపిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది..  పర్వతానికి వెళ్లే ప్రతి భక్తునికి ఒక విచిత్రమైన, అధ్బుతమైన అనుభూతి తప్పక కలుగుతుంది.  

* పర్వతాన్ని అధిరోహించి నేరుగా ఆ శివపార్వతులను దర్శించుకోవడానికి ఆ పర్వతం వద్దకు చేరుకున్న ప్రతి భక్తునికి ఏదో ఒక రూపంలో శివ పార్వతుల  దర్శనం లభిస్తుంది అని అంటుంటారు. తామర పుష్పం వంటి  ఆకారంలో గల ఆరు పర్వత ప్రాంతాల మధ్యన  ఈ కైలాస్ పర్వతం ఉంది. ఈ పర్వతం పరిసరాల వద్ద నుండి  ప్రారంభం అయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహిస్తూ వాటి దిశా మార్గంలో  ప్రపంచాన్ని మొత్తం  నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి.  

* విష్ణుపురాణం ప్రకారం ఉమామహేశ్వరులు ఇరువురు ఇక్కడే ధ్యానం చేస్తుంటారని చెబుతారు.  ఈ పర్వతం యొక్క  చుట్టుకొలత దాదాపుగా 52 కిలోమీటర్లు. ఆరోగ్యకరమైన  యాత్రికులకు ఈ పర్వతం చుట్టి రావడానికి కనీసం మూడురోజుల సమయం పడుతుంది. అందుకే ఆరోగ్యంగా ఉన్న వారిని మాత్రమే ఇక్కడికి అనుమతించడం జరుగుతుంది.

* ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. అంతేకాకుండా ప్రయత్నించిన వారు సైతం వెనక్కి తిరిగి వచ్చేశారు. కైలాస పర్వతంపై ఏముందో తెలుసుకోవడానికి అక్కడి ప్రభుత్వం రెండు సార్లు ప్రయత్నించి హెలికాప్టర్లను పంపగా అవి అదృశ్యమయ్యాయి. వాటి జాడ నేటికీ మిస్టరీగానే ఉంది.

* ఈ కైలాస పర్వతం  పాదపీఠంలో మానస సరోవరం  మరో అద్భుతం. ఎంతో స్వఛ్చమైన నీటితో ఈ మానస సరోవరం ఒక్క స్వఛ్చమైన భక్తిని తెలియచేస్తుంది. ఆ పరబ్రహ్మ తన పైనుండి ఈ సరస్సును సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు బ్రహ్మ ముహుర్తంలో ఆ పరమేశ్వరుడు ఈ సరస్సులో స్నానం  చేస్తారని మరో పురాణం.  

* ఈ కైలాస శిఖరాన్ని దర్శించుకుంటే సర్వపాపాలూ తొలగి మనిషి పునీతుడు అవుతాడని భక్తుల నమ్మకం.

ఇలా ఈ కైలాస పర్వతం ఎన్నో అద్భుతాలను తనలో రహస్యంగా దాచుకుని ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: