
ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం వల్ల మహిళలు నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో చల్లగా ఉంటారు అనేది వాళ్ల నమ్మకం . ఈ వరలక్ష్మీ వ్రతం ని రాహుకాలంలో జరుపుకోకూడదు . రేపు శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 వరకు రాహుకాలం ఉంటుంది . వరలక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు 10:30 లోపు అయినా చేసుకోవాలి 12 పైన అయినా చేసుకోవాలి. అయితే చాలామంది సూర్యోదయంతోనే చేసుకుంటారు. అది చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది అనేది వాళ్ళ నమ్మకం . అంతేకాదు వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారిని పూజించడంతో పాటు ఇంటిలో ఉప్పు దీపం పెడితే చాలా చాలా శుభం కలుగుతుంది అంటున్నారు పండితులు . నరదిషి ఉన్న.. ఇంట్లో చికాకులు ఉన్న.. అప్పుల పీడ తొలగిపోవాలి అన్న ఈ ఉప్పు దీపం కంపల్సరీ పెట్టాలి అంటున్నారు పండితులు .
ఒక ప్రమిద ను.. శుభ్రంగా నీటితో శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో పూజించుకొని ..ప్రమిదలో పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత తమలపాకు పెట్టి ఆ తమలపాకు పై రాళ్ళ ఉప్పును పరిచి ఆ పై మరొక చిన్న ప్రమిదను పెట్టి ఆ ప్రమిదను పసుపు కుంకుమలతో అలంకరించి దీపం పెడితే చాలా చాలా మంచిది అంటున్నారు. ఇది దేవుడు గదిలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఈశాన్యం మూల పెట్టుకోవచ్చు అంటున్నారు పండితులు . మర్చిపోకుండా వరలక్ష్మీ వ్రతం నాడు ఆడవాళ్లు ఇలా చేస్తే వాళ్లకు చాలా మంచి కలుగుతుంది అని ఇంటి సిరి సంపదలు పుష్కలంగా ఉంటాయి .
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కొందరు నిపుణులు.. వివిధ శాస్త్రాలలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినది మాత్రమే . వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు అనే విషయం పాఠకులకు గుర్తుంచుకోవాలి. ఇది ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం..!!