- ( రాయ‌ల‌సీమ‌ - ఇండియా హెరాల్డ్ )

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాట మరోసారి నిజమవుతుందనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేతలు ఇప్పుడు మళ్లీ అదే పార్టీ దారి చూసే పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం ఉన్న ఇద్దరు నేతలపై చర్చ నడుస్తోంది. విశాఖ నేత విజయసాయిరెడ్డి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తిరిగి వైసీపీ గూటికి వ‌స్తారని టాక్ ?


విజయసాయిరెడ్డి – విశాఖ రాజకీయాల్లో తిరిగి కీలకం?
వైసీపీ రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి.. గతంలో విశాఖలో పార్టీని బలోపేతం చేసిన ముఖ్య నాయకుడిగా గుర్తింపు పొందారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఆయన చాలా వ్యూహాలు ర‌చించారు. అనంత‌ర కాలంలో ఆయ‌న పార్టీకి దూర‌మ‌య్యారు.
అయితే, జగన్‌పై మాత్రం ఎప్పుడూ విమర్శలు చేయలేదు. ఇది ఆయన వైసీపీకి పూర్తిగా దూరంగా లేరన్న సంకేతాలు వ‌స్తున్నాయి. ప్రస్తుతం విశాఖలో పార్టీ బలహీనంగా మారిన నేపథ్యంలో, జగన్ స్వయంగా విజయసాయికి ఆహ్వానం పంపినట్లు ప్రచారం సాగుతోంది. ఆయన తిరిగి వస్తే ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి కొత్త జోష్ వ‌స్తుంద‌ని అంటున్నారు.


ఆమంచి కృష్ణమోహన్ – చీరాల నుంచి కొత్త శకంకి సంకేతమా?
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి మళ్లీ చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి.. వైసీపీ మరింత దగ్గరవాలనే దిశలో జగన్ ఆలోచిస్తున్నందున, ఆమంచిని తిరిగి పార్టీలోకి తీసుకోవడం ఓ వ్యూహాత్మక నిర్ణయంగా పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. చీరాలలో వైసీపీకి సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం కూడా ఆమంచికి అనుకూలంగా మారిన అంశం. ఈ ఇద్దరు నేతలు తిరిగి వైసీపీలో చేరితే, అది పార్టీకి ఊపు తీసుకొచ్చే అంశం కానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: