
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బల కేంద్రాలుగా నిలిచిన మాచర్ల (పల్నాడు జిల్లా), నెల్లూరు జిల్లాలలో ఇప్పుడు పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. గత ఎన్నికల దాకా ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి తిరుగే లేదనే స్థితి ఉండేది. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వలె దూకుడైన నాయకుడి హవా కొనసాగుతుండగా, నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ వంటి నేతలు పార్టీకి బలం చేకూర్చేవారు. అయితే తాజా పరిణామాలు పార్టీకి భారీ హెచ్చరికలు ఇస్తున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నమోదైన వరుస కేసులు, విచారణలు కారణంగా ఆయన రాజకీయంగా పూర్తిగా వెనకపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే పరిస్థితి ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అధికార టీడీపీ పోటీలో ఏకపక్ష విజయాన్ని సాధించగా, వైసీపీ అభ్యర్థులను ఎవరూ ముందుకు రాలేకపోయారు. ఇది పార్టీ మద్దతుదారుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించగా, కార్యకర్తల నిరుత్సాహాన్ని బయటపెట్టింది.
నెల్లూరులోనూ అంతే..
మాచర్ల విషయాన్ని పక్కన పెడితే, నెల్లూరు లో మాత్రం వైసీపీకి నేతల లోటు లేదు. అనిల్ కుమార్ యాదవ్ వంటి నాయకులు యాక్టివ్‌గా ఉన్నా ఎంపీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పోటీ చేసి ఓడిపోతే వేరే మాట, కానీ పోటీకి దిగే ధైర్యం కూడా కనబర్చకపోవడం విమర్శనీయంగా మారింది. ఇది పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. ఈ పరిణామాలపై పార్టీ అధినేత జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌చార్జ్‌లను అడిగి "ఎందుకు పోటీలో లేరు? భయపడుతున్నారా?" అని ప్రశ్నించారు. నాయకులు మాత్రం అధికార పార్టీ దూకుడుతో కార్యకర్తలు వెనకాడుతున్నారని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే జగన్ కు ఎంత మాత్రం సంతృప్తి కలిగించ లేకపోయింది. ఈ పరిస్థితులు చూస్తే, వైసీపీ నాయకులు కేడర్.. ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఈ కంచుకోటలు వైసీపీకి శాశ్వతంగా దూరమవుతాయనే ప్రచారం కు ఫుల్ స్టాప్ పడదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు