మన శాస్త్రాలు, పురాణాలు ప్రకారం ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రోజుకు కేటాయించబడారు. ముఖ్యంగా: సోమవారం – పరమశివుడు, మంగళవారం – ఆంజనేయ స్వామి / సుబ్రహ్మణ్యేశ్వర స్వామి..బుధవారం – వినాయకుడు..గురువారం – సాయిబాబా..శుక్రవారం – మహాలక్ష్మీ..శనివారం – వెంకటేశ్వర స్వామి..ఆదివారం – సూర్యుడు / నాగమ్మ. ప్రతి రోజుకు ప్రతీ దేవతకు ప్రత్యేకమైన కర్తవ్యాలు, పవిత్రతలు ఉన్నాయని పురాణాలు సూచిస్తున్నాయి. అయితే, ముఖ్యంగా బుధవారం వినాయకుడిని ప్రత్యేకంగా ఎందుకు పూజిస్తారు అనే ప్రశ్న చాలామందికి ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకు బుధవారం రోజు వినాయకుడిని ప్రత్యేకంగా పూజిస్తారు అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


*జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడు ..బుధవారం అధిపతి. బుధుడు విద్య, జ్ఞానం, మాటతీరు, వ్యాపార విజయం ఇవ్వడంలో ప్రభావశీలుడు. వినాయకుడు కూడా విద్య, జ్ఞానానికి ప్రతీక. అందువల్ల బుధవారం గణపతిని పూజిస్తే జ్ఞానం, బుద్ధి పెరుగుతాయని నమ్మకం ఉంది.

*ఏ పని ప్రారంభించేముందు అయిన గణపతిని పూజిస్తే అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. బుధవారం వారంలో మధ్యలో ఉండే రోజు. ఈ రోజు పూజిస్తే మధ్యలో వచ్చే విఘ్నాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

*బుధ గ్రహ కారకత్వం:గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు. అందువల్ల బుధవారం గణపతిని పూజించడం వల్ల బుధ గ్రహ దోషాలు తగ్గుతాయని, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం

*“బుధ–గణేశ” అనేది ప్రత్యేక యోగంగా పరిగణించబడుతుంది. బుధ గ్రహానికి సంబంధించిన దోషాలు ఉంటే, అవి తొలగించడానికి బుధవారం గణపతి పూజ చేయడం అవసరం. అలా చేస్తే చదువులో, వ్యాపారంలో, కమ్యూనికేషన్‌లో విజయాలు వస్తాయి.

*పురాతన కాలం నుంచి “బుధవారం వినాయక వ్రతం” చేస్తే కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం పెరుగుతుందని, రుణాలు తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే చాలామంది మహిళలు బుధవారం ఉపవాసం చేసి గణపతి వ్రతం చేస్తారు.

*బుధవారం గణపతిని పూజించడం వల్ల జ్ఞానం, విజయం, శ్రేయస్సు లభిస్తుందని, మధ్యలో వచ్చే విఘ్నాలు తొలగుతాయని, కుటుంబ శాంతి మరియు ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం ఉంది.

* బుధవారం గణేశుడిని ఓం గం గణపతయే నమః వంటి మంత్రాలను జపించడం.

*దుర్వా గడ్డి, మోదకాలు ..తీపి ముద్దలు మరియు పసుపు లేదా ఆకుపచ్చ పువ్వులు వంటి నైవేద్యాలను సమర్పించడం చాలా చాలా మంచిది.

* ముఖ్యంగా చదువుల్లో ముందు ఉండాలి అనుకునే వారు..రాణించాలి అనుకునేవారు వినాయకుడిని ఎక్కువుగా ఆరాధిస్తూ కొలుస్తూ ఉంటారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: