
1* పూజా విధానం పాటించకపోవడం: వినాయకుడి విగ్రహాన్ని సరిగ్గా పూజించకపోవడం, శుభ్రత లేకుండా పూజ చేయడం ఆయనకు కోపం తెప్పిస్తుంది. స్నానం చేయకుండా విగ్రహాన్ని ముట్టుకోవడం.. పూజ పై పూర్తి ప్రభావం చూపదు.
2. అసభ్య మాటలు : వినాయకుడిని అవహేళన చేయడం.. అసభ్యంగా మాట్లాడడం ఆయనకు అసహ్యం. పూజ సమయంలో, వినాయకుడిని గౌరవంగా, భక్తితో మాత్రమే పూజించాలి.
3. నచ్చని వినియోగం : వినాయకుడికి నచ్చనవి పూజలో వాడకూడదు. ఉదాహరణకు: తులసి ఆకులు..మాంసాహారం, మద్యపానం ..పాడైపోయిన పదార్థాలు వీటిని ఉపయోగించడం ఆయన కోపానికి కారణం అవుతుంది.
4. వ్రతం లేదా పూజలో విరామం: వ్రతాన్ని మధ్యలో విడిచిపెట్టడం, పూజ మధ్యలో ఏదైనా కారణంగా ఆపడం, కథనం చదివేటప్పుడు అడ్డంకులు కలిగించడం, భక్తి పాటల మధ్యలో అంతరాయం చేయడం లాంటివి కూడా కోపానికి కారణం. పూజ పూర్తి ఆధ్యాసంలో, పూర్తి నిబద్ధతతో జరుగాలి.
5. నిమజ్జనం లో తప్పులు :వినాయకుడి పూజ తర్వాత నిమజ్జనం తప్పైన విధంగా ప్రవర్తించడం, లేదా నదిలో నీళ్లు తగిన విధంగా ఉండకపోవడం కూడా ఆయన కోపానికి కారణం అవుతుంది. విగ్రహాన్ని శుభ్రమైన, ప్రవహించే నీటిలో మాత్రమే నిమజ్జనం చేయాలి.
6. భక్తి మరియు జ్ఞానాన్ని పక్కన పెడడం : వినాయకుడు జ్ఞానానికి ప్రతీక. పూజలో, భక్తి గల మనసుతో, వినయపూర్వకంగా ఉండకపోవడం ఆయనకు అసహ్యం. అహంకారంతో, గర్వంతో పూజ చేయడం అసలు ఆయనకు నచ్చదు.
7: వినాయకుడి పూజ ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. శ్రద్ధ, భక్తి, శుభ్రత, వినయం – ఇవి ఉండకపోతే పూజ పరిపూర్ణం కాదు, మరియు ఆయన కోపానికి కారణమవుతుంది. వినాయక చవితి రోజు, ఈ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే మనం ఆయన ప్రసన్నత్వాన్ని పొందగలము అనేది గుర్తు ఉంచుకోండి..!!