ఐపీఎల్ 2020 సీజన్లో టైటిల్ ఫేవరెట్ గా  రంగంలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు లో ఎన్నో రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొన్ని విజయాలు కొన్ని అపజయాలతో ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది కోల్కతా నైట్రైడర్స్ జట్టు. ఇక జట్టు  లో సమతూకం లోపించడంతో జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. వెంటనే దినేష్ కార్తీక్ ని తొలగించి అతని స్థానంలో ఇయాన్ మోర్గాన్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి అంటూ ఎంతో డిమాండ్ రావడంతో చివరికి అదే జరిగింది.



 ఇటీవలే దినేష్ కార్తీక్ స్వచ్ఛందంగా  కెప్టెన్సీ నుంచి తప్పుకోగా  ప్రస్తుతం కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కెప్టెన్గా ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ గా  వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మొదటి నుంచి ఐపీఎల్ కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరపున ఓపెనర్ గా బ్యాటింగ్కు దిగిన సునీల్ నరైన్  పై ఎన్నో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా ఓపెనర్గా బ్యాటింగ్ చేసి ఎలాంటి స్కోర్ చేయకుండానే చివరికి పేలవ ప్రదర్శనతో వెనుదిరగడంతో దినేష్ కార్తీక్ నరైన్ ని ఊరికే ఓపెనింగ్ ఎందుకు పంపిస్తున్నాడు అనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే సునీల్ నరైన్  బ్యాటింగ్కు పంపే స్థానం మారిపోయింది.



 అదే క్రమంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు సునీల్ నరైన్ తన బౌలింగ్ తో మాయ చేసి కీలక వికెట్లు పడగొట్టడం తో బౌలర్ గా  కీలక ఆటగాడిగా మారిపోయిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఇదే క్రమంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు షాక్ తగిలింది. సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ పై  అభ్యంతరాలు వచ్చాయి. కానీ ఈరోజు జరగబోయే మ్యాచ్ కి ముందే కోల్కతా నైట్రైడర్స్ గుడ్ న్యూస్ అందింది. కోల్కతా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నా స్పిన్నర్ సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ ఉంది అని అంపైర్లు ఆరోపించడంతో కొన్ని మ్యాచ్ లకు  దూరమయ్యాడు సునీల్ నరైన్. ఇక అతని బౌలింగ్ యాక్షన్ కి కమిటీ క్లీన్ చిట్ ఇవ్వడంతో మళ్లీ కోల్కతా జట్టు లో వచ్చేసాడు సునీల్ నరైన్.

మరింత సమాచారం తెలుసుకోండి: