మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ టి20 వరల్డ్ కప్ కోసం అటు టీమిండియా కూడా సిద్ధం అయిపోతుంది. ఇప్పటికే యూఏఈలో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. ఈసారి టీమ్ ఇండియా జట్టుకు వరల్డ్ కప్ వీరుడిగా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్ గా ఉండడం ఎంతో కలిసొచ్చే అంశమని చెప్పాలి. అయితే ఇక టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా ప్రదర్శన ఎలా ఉండబోతోంది అనే దానిపై ప్రస్తుతం ఎంతో మంది మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా టీమిండియాలోని ఆ ఒక్కడి పైనే అందరి చూపు ఉంది అని చెప్పాలి. అతని గురించే అందరూ మాట్లాడుతున్నారు. అతను బాగా రాణిస్తే బాగుండు అని కోరుకుంటున్నారు.


 టీమిండియాలో అతనొక గొప్ప టెక్నికల్ ఆటగాడు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయాడు ఆ ఆటగాడు. ఇంతకీ ఆ ఒకే ఒక్కడు ఎవరు అని అనుకుంటున్నారా.. ఇంకెవరు గత కొన్ని రోజుల నుంచి మంచి ఫామ్ లో దూసుకుపోతున్న కె.ఎల్.రాహుల్   ప్రస్తుతం టీమిండియా లో ఒక సూపర్ టెక్నికల్ బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు కేఎల్ రాహుల్. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇటీవల ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్గా కూడా అద్భుతంగా రాణించాడు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే కె.ఎల్.రాహుల్ టి20 వరల్డ్ కప్ లో కూడా రాణించాలని ఎంతో మంది మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు. ఇటీవలే కె.ఎల్.రాహుల్ ప్రదర్శనపై టీమిండియా క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టుకు కె.ఎల్.రాహుల్ గొప్ప ఆసక్తి అంటూ వ్యాఖ్యానించాడు. నేను కె.ఎల్.రాహుల్ ఆటను ఆస్వాదిస్తాను. అతడు చాలా కాన్ఫిడెంట్ తో షాట్లు ఆడతాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో గొప్పగా రాణించాడు. కె.ఎల్.రాహుల్ టి20 ప్రపంచ కప్ లో కూడా అదేరీతిలో రాణించాలని భావిస్తున్నాను. భవిష్యత్తులో అతడు భారత జట్టుకు మరిన్ని సేవలు అందిస్తాడు అంటూ కపిల్ దేవ్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: