కరోనా తర్వాత జరుగుతున్న పెద్ద ఐసీసీ ఈవెంట్ కావడంతో టీ 20 వరల్డ్ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు క్రికెట్ ప్రేమికులు. అనుకున్న విధంగానే అంచనాలకు మించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతూ అసలైన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తోంది. ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు రాత్రి షార్జా వేదికగా ఆఫ్గనిస్తాన్ మరియు స్కాట్లాండ్ ల మధ్య సూపర్ 12 మ్యాచ్ జరుగుతోంది. అనుకున్నట్లు గానే ఆఫ్గనిస్తాన్ స్కాట్లాండ్ బౌలర్లను ఉతికారేసింది. నబి సేన షార్జాలో పరుగులు వరద పారించింది.

స్కాట్లాండ్ బౌలర్ల దగ్గర వీరి దూకుడు ముందు సమాధానం లేకుండా పోయింది. ఓపెనర్లు ఇద్దరూ మోడైట్ పవెర్ ప్లే లోనే 55 పరుగులు పిండుకున్నారు. ఈ దూకుడు చూశాక 200 మార్క్ తప్పదేమో అనుకున్నారు. కానీ మధ్యలో కొంచెం జోరు తగ్గడంతో 190 పరుగుల వద్ద ఆఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. క్వాలిఫైయర్ దశలో బాగా ఆడిన స్కాట్లాండ్ సూపర్ 12 లో కీలకమైన మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది. ఆఫ్గనిస్తాన్ స్కోర్ ను ఛేదించడం అంత సులువు కాదు. మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరియు నబి లను స్కాట్లాండ్ ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి.

ఆఫ్గనిస్తాన్ భారీ లక్ష్యాన్ని స్కాట్లాండ్ ముందుంచింది. ఆఫ్గనిస్తాన్ కు షాక్ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి పిచ్ కూడా బ్యాటింగ్ కు బాగా సహకరిస్తోంది. మొదటి ఓవర్ నుండి దూకుడుగా ఆడితే లక్ష్యం చిన్నదే అవుతుంది. మొదటి పవర్ ప్లే లో వికెట్ కాపాడుకుని ఆ తర్వాత ఎటాక్ చేస్తే ఫలితం ఉండొచ్చు. ముఖ్యంగా కెప్టెన్ కైల్ కొయెట్జర్, బెరింగ్టన్, మున్సీ ధాటిగా ఆడితే ఈ లక్ష్యాన్ని ఊదేయవచ్చు. మరి ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టిస్తుందా అన్నది తెలియాలంటే ఛేజింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: