
గతేడాది అక్టోబర్ నెల నుంచి అన్ని దేశాల ఆటగాళ్లు కూడా నిర్విరామంగా ఏదో ఒక టోర్నీ ఆడుతూనే ఉన్నారు. ఐపీఎల్ 2021 కోసం భారత్ వచ్చిన ప్లేయర్లంతా కూడా భారత్ చేరుకున్నారు. అటు ఇండియన్ ప్లేయర్స్ కూడా నిరంతరంగా క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. భారత జట్టు శ్రీలంక, ఇంగ్లండ్ దేశాల్లో పర్యటించింది. ఆ తర్వాత ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీలో పాల్గొంది. ఆ వెంటనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పయనమైంది భారత జట్టు. అక్కడ ఐపీఎల్ 2021 టోర్నీలో మిగిలిన సగం మ్యాచ్‌లు అడేశారు ఆటగాళ్లు అంతా. ఈ మెగా టోర్నీ ముగిసిన నాలుగు రోజులకే మళ్లీ ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. దాదాపు నెల రోజుల పాటు ప్రపంచ కప కోసం ఆటగాళ్లు అంతా శ్రమించారు. చివరికి అది కాస్తా ఆస్ట్రేలియా ఖాతాలో చేరింది. నవంబర్ 14వ తేదీతో టోర్నీ ముగియగా... తెల్లారే ఆటగాళ్లు అంతా పెట్టే బేడ సర్దుకుని ఇండియాకు వచ్చేశారు. 17వ తేదీ నుంచి భారత్ - న్యూజీలాండ్ జట్ల మధ్య 3 టీ 20లు 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. అది ముగిసిన సరిగ్గా పది రోజులకు సౌతాఫ్రికాతో జరిగే ద్వై పాక్షిక సిరిస్‌లో పాల్గొననుంది టీమిండియా. అక్కడ 3 టెస్టులు, 3 వన్డేలు, 4 ట్వంటీ 20లు ఆడాల్సి ఉంది. అది ముగిసిన వెంటనే వెస్టిండీస్‌తో సిరీస్. ఇలా వరుస షెడ్యూల్ వల్ల ఆటగాళ్ల ఫిట్‌నెస్ పై కూడా ప్రభావం చూపిస్తుందని క్రీడా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.