ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ఏ రేంజిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మ్యాచ్ వస్తుంది అంటే చాలు అందరూ ఎంతో ఆసక్తిగా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా  సాగుతున్న సమయంలో జరిగే సన్నివేశాలు మాత్రం అందరికీ నవ్వు తెప్పిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు డిఆర్ఎస్ ఎందుకు కోరుకుంటారు అనే విషయం పై దాదాపు అందరు ప్రేక్షకులకు క్లారిటీ ఉంటుంది. వికెట్  విషయంలో  కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఎంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ థర్డ్ అంపైర్ ని ఆశ్రయిస్తుంటారు దీన్నే డిఆర్ఎస్ అంటారు.



 ఇలా దాదాపుగా ప్రతి మ్యాచ్ లో కూడా డిఆర్ఎస్ కోరుకోవడం చూస్తూ ఉంటాం. కానీ క్లీన్ బోల్డ్ అయిన తర్వాత ఎవరైనా డిఆర్ఎస్ కోరుకుంటారా.. క్లీన్ బోల్డ్ అయ్యాక ఇంకా డిఆర్ఎస్ కోరుకోవడానికి ఏముంది అని అంటారు క్రికెట్ ప్రేక్షకులు ఎవరైనా. కానీ ఇక్కడ  ఒక క్రికెటర్ మాత్రం క్లీన్ బౌల్డ్ అయిన సమయంలో కూడా డిఆర్ఎస్ కోరుకున్నాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు ఇండియన్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ప్రస్తుతం న్యూజిలాండ్ భారత్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది టెస్ట్ మ్యాచ్లో భాగంగా రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ కి వచ్చాడు.



 ఈ క్రమంలోనే న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ వేశాడు.. ఇక అతని బౌలింగులో రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ ఇది అశ్విన్ గమనించలేదు.. దీంతో వెంటనే రివ్యూ కోరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అని వెనక్కి చూసిన తర్వాత అతనికి అసలు సీన్ అర్థమైంది. దీంతో రివ్యూ వెనక్కి తీసుకుని పెవిలియన్ చేరాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక దీనికి సంబంధించిన వీడియోను ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన తర్వాత క్లీన్ బౌల్డ్ అయిన తర్వాత  రివ్యూ ఏంటి అశ్విన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: