ఐపీఎల్ 2022 సీజన్ కోసం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇస్తుండడంతో ఈసారి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ పక్కా అని బలంగా నమ్ముతున్నారు. అయితే ఇక జట్ల లోని ఆటగాళ్లు తారుమారు అయిన తర్వాత ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో ఏ జట్టు ఎలా రాణించబోతుంది అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది. దీంతో ప్రేక్షకుల్లో ఇక ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. అంతే కాకుండా ఫిబ్రవరి మొదటి వారంలో ఐపీఎల్ మెగా వేలం నిర్వహిస్తామని అటు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ మెగా వేలంలో ఎవరు ఎక్కువ ధర పలిక బోతున్నారు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇకపోతే ఈ మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్ లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్ లు కూడా ఉండడం గమనార్హం. దీంతో స్టార్ ప్లేయర్ లను సొంతం చేసుకోవడానికి  ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఇక కొంతమందిని కొనుగోలు చేసేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా ఫ్రాంచైజీ లు  సిద్ధంగా ఉన్నాయి అంటూ గత కొన్ని రోజుల నుంచి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ కూడా మెగా వేలంలో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గతంలో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు కె.ఎల్.రాహుల్. అంతేకాదు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ఐపీఎల్ లో రికార్డు సృష్టించాడు. అయితే ఇటీవలే ఐపీఎల్ మెగా వేలానికి ముందే లక్నో ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్ తో ఒప్పందం కుదుర్చుకుని రిటైన్ చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా కేఎల్ రాహుల్ కి 17 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక లక్నో జట్టుకి కె.ఎల్.రాహుల్ కెప్టెన్గా వ్యవహరించ పోతున్నాడట. దీంతో ఇక ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా కె.ఎల్.రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 16 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ జడేజాకు 16 కోట్లు చెల్లించింది. కానీ ఇప్పటివరకు ఏ జట్టు కూడా 17 కోట్లు చెల్లించి ఆటగాడిని కొనుగోలు చేయలేదు. దీంతో ఇలా 17 కోట్లు పలికిన ఆటగాడిగా కె.ఎల్.రాహుల్ రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: