ఎన్నో రోజుల పాటు భారత క్రికెట్లో కీలకమైన బౌలర్ గా కొనసాగిన శ్రీశాంత్   ఆ తర్వాత మాత్రం స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురి అయ్యాడు అన్న విషయం తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన శ్రీశాంత్ పై తీవ్రస్థాయిలో మండిపడింది బీసీసీఐ. ఏకంగా జీవితకాల నిషేధం విధిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీకాంత్ కెరీర్ మొత్తం ఒక్కసారిగా పాడై పోయింది అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో అతనికి 2019లో ఊరట లభించింది. ఇక అతని పై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏడేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది  బీసీసీఐ. దీంతో 2020 సెప్టెంబర్ లో నిషేధం తొలగిపోయింది.


 ఈ క్రమంలోనే క్రికెట్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు మళ్లీ సిద్ధమైపోతున్నాడు శ్రీశాంత్. మళ్లీ మైదానంలోకి తన ఆటను మెరుగుపరచుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ 2021లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీ లలో కేరళ తరఫున శ్రీశాంత్ బరిలోకి దిగాడు అన్న విషయం తెలిసిందే. ఇక విజయ్ హజారే ట్రోఫీ లో భాగంగా ఆరు మ్యాచ్లు ఆడిన శ్రీశాంత్ ఏకంగా 13 వికెట్లు పడగొట్టి రాణించాడు. ఇలా క్రికెట్లో మళ్లీ రాణించి భారత జట్టులో స్థానం సంపాదిస్తాను అంటూ శ్రీశాంత్ చెబుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో స్థానం దక్కించుకోవడానికి శ్రీశాంత్ ప్రయత్నాలు  మొదలుపెట్టాడు.. ఈ క్రమంలోనే మరికొన్ని రోజులలో జరగబోయే మెగా వేలంలో కనిపించనున్నాడు శ్రీశాంత్.


 ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే మెగా వేలం కోసం శ్రీశాంత్ తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కనీస ధరను 50 లక్షలు గా నిర్ణయించాడు. 2021లో కూడా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు శ్రీశాంత్ ప్రయత్నించాడు. తన కనీస ధర 75 లక్షలు గా నిర్ణయించినప్పటికీ అతని కొనుక్కునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. ఈసారి మెగా వేలం లోకి అడుగు పెడుతూ ఉండటంతో శ్రీశాంత్ను దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ అన్న ఆసక్తి చూపుతుందా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. 2013లో ఐపీఎల్లో చివరిసారిగా శ్రీశాంత్  మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: