ఐపిఎల్ సీజన్ 15 ఆసక్తికరంగా మారుతోంది. ఈ సారి అంచనాలు లేని జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. మరియు టైటిల్ గెలిచేందుకు అర్హత కలిగిన జట్లు ఏమో చతికిలపడుతున్నాయి. ఐపిఎల్ లో అద్భుతమైన రికార్డు ఉన్న ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ లు ఇప్పటి వరకు చెరో మూడు మ్యాచ్ లు ఆడగా ఇంకా పాయింట్ల పట్టికలో ఖాతా తెరవకుండా ఉండడం అత్యంత బాధాకరం అని చెప్పాలి. గత రాత్రి ముంబై ఇండియన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్యన పుణె వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలుస్తుందని అంతా అనుకున్నారు.

కానీ అంచనాలు అన్నీ తలక్రిందులు అయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 161 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసి కోల్కతా కు సవాలు విసిరింది. ముంబై జట్టులో వరుసగా ఇషాన్ కిషన్ మరియు రోహిత్ శర్మ లు ఫెయిల్ అయ్యారు. ఐపిఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న బేబీ డివిలియర్స్ బ్రేవిస్ వచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయాడు. సీజన్ లో మొదటి మ్యాచ్ ఆడిన సూర్య కుమార్ యాదవ్ మరియు యంగ్ గన్ తిలక్ వర్మ లు ముంబై కు ఈ స్కోర్ రావడంలో కీలక పాత్ర పోషించారు. ఒక ఆఖరి ఓవర్ లో కీరన్ పోలార్డ్ మూడు సిక్సర్లు సాధించి 161 పరుగులు అవడంలో తన వంతు ప్రయత్నం చేశాడు.

కోల్కతా ఛేదనలో మొదట పవర్ ప్లేలో బాగా తడబడింది. ఆ తర్వాత మెల్లగా పుంజుకుని స్కోర్ బోర్డు ఆగకుండా పరుగులు చేశారు. అయితే ఒక దశలో ముంబై ఇండియన్స్ వరుసగా వికెట్లు తీసి మ్యాచ్ పై పటు బిగించేలా కనిపించింది. కానీ 16 వ ఓవర్ లో బౌలింగ్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్  డేనియల్ సామ్స్ బౌలింగ్ లో 35 పరుగులు సాధించి మ్యాచ్ ను ముగించాడు. ఈ క్రమంలో పాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ 14 బంతుల్లో 50 సాధించి ఇంతకు ముందు రికార్డు సాధించిన రాహుల్ సరసన చేరాడు. ఇతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు మరియు 6 సిక్సర్లు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: