ఈ ఏడాది టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు అభిమానుల అంచనాలను తారుమారు చేసింది. ఒక మ్యాచ్ loకూడా సరైన ప్రదర్శన చేయలేకపోయింది. ప్రత్యర్థికీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో పేలవ ప్రదర్శన కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. చివరికి అందరి కంటే ముందే ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకోవడానికి ఛాన్సులు లేక ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ క్రమంలోనే 2023 సీజన్ పై కన్నేసిన ముంబై ఇండియన్ తన బెంచ్ బలాన్ని కూడా పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.


 ఈ క్రమంలోనే నామమాత్రమైన మ్యాచులలో ఇక మొన్నటివరకు బెంచ్ కు పరిమితమైన ఆటగాళ్లు అందరికీ కూడా అవకాశాలు ఇచ్చింది.  ప్రతి మ్యాచ్లో ఒకరు లేదా ఇద్దరు యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు కల్పిస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ క్రికెట్ దేవుడు రోహిత్ శర్మ గురువు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ లో కొనసాగుతున్నాడు. కానీ ఇప్పటివరకు తుది జట్టులో అవకాశం రాలేదు.


 ఇటీవల బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్న  నేపథ్యంలో రోహిత్ శర్మ తన గురువుగా సచిన్ టెండూల్కర్ కొడుకుకీ అవకాశం ఇస్తాడు  అని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ  మరోసారి నిరాశ తప్పలేదు. ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ కు అవకాశం దక్కలేదు. గత సీజన్ నుంచి అతను జట్టుతో ఉంటున్న ఇప్పుడు వరకు తుది జట్టులో ఛాన్స్ రాలేదు. సోకిమ్, కుమార్ కార్తికేయ లాంటి ప్లేయర్స్ కి అవకాశం ఇచ్చిన రోహిత్ శర్మ అర్జున్ టెండూల్కర్ ను మాత్రం పట్టించుకోలేదు అని ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారూ. దీంతో నీ గురువుకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: